సీనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కృష్ణ తీసిన ఐదు సినిమాలు ఇవే!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలీవుడ్ టాప్ హీరోల మధ్య పోటీ ఉందనే సంగతి తెలిసిందే.తెలుగులో నంబర్ వన్ హీరో స్థానానికి ప్రస్తుతం ఆరుగురు స్టార్ హీరోల మధ్య పోటీ ఉంది.

 Interesting Factsa About Krishna Against Senior Ntr Movies Details Here , Agani-TeluguStop.com

ఎవరు నంబర్ వన్ హీరోనో క్లారిటీ రావాలంటే మరో రెండు మూడేళ్లు ఆగాల్సిందే.చాలా సంవత్సరాల క్రితం సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ మధ్య కూడా సినిమాలపరంగా, రాజకీయాల పరంగా పోటీ ఉండేది.

మొదట ఎన్టీఆర్ రాజకీయాలపై ఆసక్తి చూపితే కృష్ణ పాలిటిక్స్ పై ఆసక్తి చూపలేదు.

కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కృష్ణ కేరీర్ తొలినాళ్లలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదు.

కృష్ణ నటించిన ఈనాడు సినిమా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండగా ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కు ఈ సినిమా పరోక్షంగా హెల్ప్ అయింది.టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ హీరోలుగా అప్పట్లో కృష్ణ, ఎన్టీఆర్ లకు గుర్తింపు ఉండేది.

కృష్ణ కూడా రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరినా ఆయన పట్టించుకునేవారు కాదు.

రాజకీయ ప్రముఖుల నుంచి ఆహ్వానం వచ్చినా కృష్ణ ఆ ప్రతిపాదనలను సున్నితంగా తిరస్కరించేవారు.రాజీవ్ గాంధీ ఆహ్వానంపై తర్వాత రోజుల్లో కృష్ణ కాంగ్రెస్ లో చేరారు.సింహాసనం, నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు (కృష్ణ గెస్ట్ అప్పియరెన్స్), సాహసమే నా ఊపిరి, గండిపేట రహస్యం సినిమాలను కృష్ణ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా తీశారు.ఈ సినిమాలలో కొన్ని సినిమాలకు విజయనిర్మల దర్శకత్వం వహించారు.

కృష్ణ ఈ సినిమాలలో కొన్ని సినిమాలలో నటిస్తే కొన్ని సినిమాలలో వేరే వాళ్లను నటింపజేశారు.ఈ సినిమాలలో కొన్ని సినిమాలపై అప్పటి టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సినిమాలలో కొన్ని సినిమాలలో సీనియర్ ఎన్టీఆర్ తరచూ వాడే ఊత పదాలను ఉపయోగించారు.

Super Star Krishna Movies Against Senior NTR

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube