చంద్రబాబు కేసును వాదిస్తున్న లాయర్ ఇతనే.. ఇతని ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu )ను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నాయుడు పేరును ఎఫ్.

 Interesting Facts About Lawyer Siddarth Luthra Details Here Goes Viral In Socia-TeluguStop.com

ఐ.ఆర్ లో చేర్చిందని సమాచారం.సీఐడీ కోర్టు( CID Court )కు రిమాండ్ రిపోర్ట్ ను సమర్పించడం జరిగింది.చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు న్యాయమూర్తి సిద్దార్త్ లూత్రా వాదనలు వినిపించనున్నారు.ఈ లాయర్ కేసును బట్టి గంటకు 15 లక్షల రూపాయల వరకు ఫీజును వసూలు చేస్తారని తెలుస్తోంది.

Telugu Chandrababu, Cid, Delhi-General-Telugu

ఢిల్లీ( Delhi ) నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఈ అడ్వకేట్ గతంలో అమరావతి భూముల కేసులను, చంద్రబాబు ఇతర కేసులను, వివేకా హత్య కేసులో సునీత తరపున వాదనలను వినిపించడం జరిగింది.ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించిన సిద్దార్థ్ లూత్రా క్రిమినల్ లాయర్ గా తనకంటూ మంచి పేరును సంపాదించుకున్నారు.సిద్దార్థ్ ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్, కామన్వెల్త్ లాయర్ అసోసియేషన్ లో కూడా సభ్యుడు కావడం గమనార్హం.

Telugu Chandrababu, Cid, Delhi-General-Telugu

ఆధార్ స్కీమ్ యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన కేసు, ట్రిపుల్ తలాక్ చట్టం చెల్లుబాటు గురించి సవాల్ చేస్తూ దాఖలైన కేసు లూత్రా చేపట్టిన ముఖ్య కేసులు కావడం గమనార్హం.మన దేశంలోని టాప్ 10 లాయర్లలో సిద్దార్థ్( Sidharth Luthra ) ఒకరు కాగా సిద్దార్థ్ తండ్రి కూడా న్యాయవాది కావడం హాట్ టాపిక్ అవుతోంది.సిద్దార్థ్ లూత్రా సొంతంగా కొన్ని పుస్తకాలను రాశారు.ఇతర దేశాల్లోని కోర్టుల్లో పని చేసిన అనుభవం సిద్దార్థ్ లూత్రాకు ఉంది.చంద్రబాబు తరపున సిద్దార్థ్ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కేసు నుంచి చంద్రబాబు సులువుగా బయటపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.2024 ఎన్నికల సమయంలో అరెస్ట్ కావడం చంద్రబాబుకు ఇబ్బందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.చంద్రబాబు నాయుడు ఈ కేసు నుంచి ఏ విధంగా బయటపడతారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube