అమెరికాలో కనిపించకుండా పోయిన తెలుగు విద్యార్ధి .. భయాందోళనలో పేరెంట్స్

ఉన్నత విద్యా కోసం అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్ధుల( Indian Students ) హత్యలు, అదృశ్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు.తాజాగా అగ్రరాజ్యంలో మరో భారతీయ విద్యార్ధి అదృశ్యమయ్యాడు.

 Indian Student From Telangana Missing In America Since May 2 Details, Indian Stu-TeluguStop.com

తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది( Rupesh Chandra Chintakindi ) చికాగో( Chicago ) నగరంలో కనిపించకుండా పోయాడు.మే 2 నుంచి ఆయన జాడ తెలియరావడం లేదని చికాగోలోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం వెల్లడించింది.

రూపేశ్ ప్రస్తుతం చికాగోలోని విస్కాన్సిన్‌లో వున్న కాంకార్డియా యూనివర్సిటీలో( Concordia University ) చదువుకుంటున్నారు.అతని ఆచూకీ కోసం పోలీసులు, ప్రవాస భారతీయులతో నిరంతరం టచ్‌లో వున్నట్లు కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.

రూపేశ్ జాడ త్వరలోనే తెలుస్తుందని.అతని గురించి ఎలాంటి సమాచారం వున్నా తమను సంప్రదించాల్సిదిగా పేర్కొంది.

మరోవైపు కుమారుడి అదృశ్యం వార్త తెలుసుకున్న రూపేశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత్‌లోని యూఎస్ ఎంబసీని( US Embassy ) వారు కోరారు.

కాగా.ఈ ఏడాది ప్రారంభం నుంచి నేటి వరకు అమెరికాలో దాడులు, కిడ్నాప్‌లలో పలువురు భారత సంతతి విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Telugu America, Chicago, Cleveland, Concordia, Indian, Rupeshchandra, Telangana,

అంతకుముందు ఏప్రిల్‌లో తెలంగాణకే( Telangana ) చెందిన పాతికేళ్ల విద్యార్ధి కూడా క్లీవ్‌లాండ్( Cleveland ) నగరంలో కనిపించకుండాపోయి శవమై కనిపించాడు.హైదరాబాద్ నాచారంకు చెందిన మహ్మద్ అబ్ధుల్ అర్ఫాత్ .క్లీవ్‌లాండ్ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్ చేసేందుకు గతేడాది మేలో అమెరికా వెళ్లాడు.మార్చి నెలలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్ మిస్సౌరీలోని సెయింట్ లూయిస్‌లో కాల్చిచంపబడ్డాడు.

అలాగే పర్డ్యూ యూనివర్సిటీలో 23 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్ధి సమీర్ కామత్ ఫిబ్రవరి 5న ఇండియానాలో శవమై కనిపించాడు.

Telugu America, Chicago, Cleveland, Concordia, Indian, Rupeshchandra, Telangana,

ఫిబ్రవరి 2న వివేక్ తనేజా (41) అనే భారతీయ సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్ వాషింగ్టన్‌లోని ఒక రెస్టారెంట్ వెలుపల దాడికి గురయ్యాడు.జనవరిలో 18 ఏళ్ల అకుల్ ధావన్ అనే మరో విద్యార్ధి ఇల్లినాయిస్ యూనివర్సిటీ క్యాంపస్ వెలుపల అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మరణించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube