నాలుగో టెస్ట్ లో ఓటమి దిశగా భారత్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ కష్టమే..!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో స్థానం కోసం ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్ లు పోటీ పడుతున్నాయి.అయితే ఇండోర్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా బెర్త్ కన్ఫామ్ చేసుకుంది.

 India Struggling Vs Australia In Fourth Test Match Details, India Vs Australia ,-TeluguStop.com

ఇక రేసులో భారత్ మరియు శ్రీలంక ఉన్నాయి.భారత్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో స్థానం దక్కాలంటే అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించాలి.

అయితే కథ అంతా అడ్డం తిరిగింది.మూడో టెస్ట్ మ్యాచ్లో ఫామ్ లోకి వచ్చిన ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని బరిలోకి దిగింది.

నరేంద్ర మోడీ స్టేడియంలో భారత బౌలర్లకు చెమటలు పట్టిస్తూ భారీ స్కోరు దిశగా సాగుతోంది.భారత్ బౌలింగ్ లోనే కాక, ఫీల్డింగ్ లో కూడా విఫలమౌతోంది.చేతికి వచ్చిన అవకాశాలను జారీ విడిచి ఆస్ట్రేలియాకు చాన్సులు ఇవ్వడంతో ఆస్ట్రేలియా చెలరేగి అద్భుత ఆటను ప్రదర్శిస్తోంది.ఆస్ట్రేలియా ఇప్పటికే 400 స్కోరు చేసి,7 వికెట్లు కోల్పోయింది.

ఈ సమయంలో భారత్ కు మిగిలిన వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది.

ఇక శ్రీలంక – న్యూజిలాండ్ మధ్య జరిగే రెండు టెస్టుల మ్యాచ్లో శ్రీలంక మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది.రెండవ టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఓడిపోతే భారత్ కు ఫైనల్ కు చేరే అవకాశం ఉంది.భారత్ నాలుగో టెస్ట్ గెలిచిన, లేదంటే మ్యాచ్ డ్రా చేసుకున్న శ్రీలంక ఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్టే.

అంటే శ్రీలంక- న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచ్లో శ్రీలంక గెలిచినా కూడా భారత్ కు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.అంటే భారత్ నాలుగో టెస్ట్ లో ఓడితే, అక్కడ శ్రీలంక కూడా ఓడిపోతేనే భారత్ కు అవకాశం ఉంటుంది.

భారత్ లేదా శ్రీలంక 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube