ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది.బ్యాంకులో క్యాషియర్ గా పని చేస్తున్న యుగంధర్ ఖాతాదారుల డబ్బులు కాజేశారని సమాచారం.
ఫోర్జరీ సంతకాలతో సుమారు రూ.లక్షా 60 వేలను క్యాషియర్ మాయం చేశాడని అధికారులు గుర్తించారు.ఈ క్రమంలో విచారణ చేసిన ఉన్నతాధికారులు క్యాషియర్ యుగంధర్ పై సస్పెన్షన్ వేటు వేశారు.







