ఫ్రాన్స్ లో జరిగిన దాడులను తాను ఖండిస్తు న్నట్టు వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ సౌదీ అరేబియాలో వెల్లడించారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వివిధ ప్రాంతాలలో ముస్లింలను రెచ్చగొట్టేలా తను ప్రసంగాలు చేశానంటూ వస్తున్న ఆరోపణలు సరైనవి కాదని అన్నారు.
ప్రపంచంలో శాంతి నెలకొనాలన్నదే తన ఉద్దేశమని, ఇస్లాం శాంతి కోరుకుంటుందన్నది తన ప్రసంగాల సారమని స్పష్టం చేసారాయన.
ఉగ్రవాదం వైపు ముస్లింలు వెళ్లాలంటూ వ్యాఖ్యలు చేసానంటూ కొన్ని మీడియా సంస్ధలు తన వ్యాఖ్యలను వారికి ఇష్టమెచ్చిన తీరుగా వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేసారు.
తనపై వచ్చిన ఆరోపణలకు సౌదీ నుంచే స్కైప్ ద్వారా వివరణ ఇస్తున్నా, వాటిని ప్రచురించేందుకు మీడియా సంస్ధలు సిద్దపడకపోవటం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.ఉగ్రవాదాన్ని తాను ఏ మాత్రం సమర్థించబోనని, ఫ్రాన్్సతో సహా ఎక్కడ ఏప్రాంతంలో అమాయకులపై దాడులు జరిగినా తను ఖండిస్తానని, , ఇస్లాం రక్తపాతాన్ని కోరుకోవటంలేదని ఉగ్రవాదులు గుర్తించాలని కోరారు జకీర్.