గురుగ్రహంపై కనిపించిన భయంకరమైన ఫేస్.. హడలిపోతున్న నాసా శాస్త్రవేత్తలు..

2023, సెప్టెంబర్ 7న, నాసాకు చెందిన జూనో అంతరిక్ష నౌక 54వ సారి బృహస్పతి లేదా గురు గ్రహానికి( Jupiter ) చాలా దగ్గరగా వెళ్లింది.ఆ సందర్భంగా ఇది గురు గ్రహంపై ఒక విచిత్రమైన ముఖం ఆకారంలో ఉన్న చిత్రాన్ని తీసింది.

 Horrible Face Seen On Jupiter.. Nasa Scientists Are Panicking , Nasa Scientists-TeluguStop.com

ఈ ఇమేజ్ చూసి శాస్త్రవేత్తలు కూడా షాక్‌ అయ్యారు.జెట్ N7 అని పిలిచే ఈ ఇమేజ్ బృహస్పతి యొక్క ఉత్తరాన కొంత భాగాన్ని చూపుతుంది.

అక్కడ చాలా మేఘాలు, తుఫానులు ఏర్పడుతుంటాయి.ఆకాశంలో సూర్యుడు తక్కువ ఎత్తుకి వచ్చినప్పుడు అవి భిన్నంగా కనిపిస్తాయి.

సూర్యుడు ఈ ప్రాంతం లక్షణాలను మరింత ప్రత్యేకంగా నిలిపేలా చేస్తాడు.ఇది బృహస్పతి వాతావరణం ఎలా పనిచేస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.

జూనో( Juno ) చిత్రాన్ని తీసిన సమయంలో బృహస్పతికి 7,700 కిలోమీటర్ల దూరంలో ఉంది.జూనో ఉత్తర ధ్రువం ఎడమవైపు 69 డిగ్రీలు ఉన్న ప్రదేశంలో ఉందని, అది తీసిన చిత్రాన్ని పరేడోలియా అంటారని నాసా తెలిపింది.

మనం నిజంగా ఉనికిలో లేని ముఖాలు లేదా నమూనాలను చూసినప్పుడు దానిని పరేడోలియా అంటారు.మన మెదళ్ళు ఏవేవో ఆకృతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఇది జరుగుతుంది.

జూనో తరచుగా బృహస్పతిపై పరేడోలియాను చూస్తుంది.ఇది అన్వేషణను మరింత ఆసక్తికరంగా చేస్తుంది.

Telugu Earth, Juno, Jupiter, Nasa-Latest News - Telugu

వ్లాదిమిర్ తారాసోవ్ ( Vladimir Tarasov )అనే వ్యక్తి చిత్రాన్ని మరింత మెరుగ్గా చూపించాడు.అతను జూనోలోని కెమెరా అయిన జూనోక్యామ్ నుంచి ఒరిజినల్ డేటాను ఉపయోగించాడు.ఇమేజ్‌లు రూపొందించడానికి జూనోక్యామ్ డేటాను ఎవరైనా ఉపయోగించడానికి నాసా అనుమతిస్తుంది.ఎందుకంటే ప్రజలు తన మిషన్లు, సైన్స్‌లో భాగం కావాలని నాసా కోరుకుంటుంది.

Telugu Earth, Juno, Jupiter, Nasa-Latest News - Telugu

జూనో తన ప్రయాణాన్ని 2011లో ప్రారంభించింది.ఇది 2016లో బృహస్పతిని చేరుకుంది.అప్పటి నుంచి ఇది బృహస్పతి వాతావరణం, అయస్కాంత క్షేత్రం, లోపలి భాగాన్ని అధ్యయనం చేస్తోంది.గురుగ్రహం గురించి ఇంతకు ముందు ఎవ్వరికీ తెలియని ఎన్నో కొత్త విషయాలను ఇది కనుగొంది.

బృహస్పతి చుట్టూ ఉన్న రేడియేషన్( Radiation ) కారణంగా ఎనిమిది సార్లు జూనో పని చేయడం మానేసింది.అయితే ఇది 2023, అక్టోబర్ నాటికి బృహస్పతి చుట్టూ 55 సార్లు తిరిగింది.

ఆ తర్వాత కూడా పని చేస్తోంది.జూనో ఎక్కువ సమయం పాటు బృహస్పతి చుట్టూ ఎగురుతూనే ఉంటుంది.

ఈ అద్భుతమైన మిషన్ నుండి మరిన్ని అద్భుతమైన చిత్రాలు, ఆవిష్కరణలను చూడాలని సైంటిస్ట్స్‌ ఆశిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube