సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఎవరైనా తమ సినీ కెరీర్ లో హిట్టైన సినిమాలు అంటే ఎంతో ఇష్టమని చెబుతారు.అయితే రష్మిక( Rashmika ) మాత్రం తన సినీ కెరీర్ లో ఫ్లాప్ గా నిలిచిన డియర్ కామ్రేడ్( Dear Comrade ) సినిమా అంటే ఎంతో ఇష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2( Pushpa 2 ) సినిమాలో ఒకింత గ్లామరస్ గా కనిపించనున్న ఈ బ్యూటీకి పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని సమాచారం అందుతుండటం గమనార్హం.
పుష్ప ది రూల్ సినిమాలో శ్రీవల్లి 2.0 చూస్తారని చెబుతున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.డియర్ కామ్రేడ్ మూవీ నా మనస్సుకు నచ్చిన మూవీ అని రష్మిక చెబుతున్నారు.పుష్ప2 సినిమా మరింత బాధ్యతను పెంచిందని ఆమె అన్నారు.డియర్ కామ్రేడ్ మూవీ ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదని రష్మిక వెల్లడించడం గమనార్హం.
డియర్ కామ్రేడ్ మూవీలో నా రోల్ కు, నా యాక్టింగ్ స్కిల్స్ కు ప్రశంసలు వచ్చాయని నా అభిమానులకు సైతం నా రోల్ ఎంతో నచ్చిందని ఆమె పేర్కొన్నారు.భరత్ అనే డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.రష్మికకు మరో ఐదేళ్ల పాటు కెరీర్ పరంగా తిరుగుండదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రెమ్యునరేషన్ పరంగా సైతం రష్మిక ఒకింత టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.రష్మిక రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.ఇతర భాషలపై ఫోకస్ పెడుతున్న రష్మిక ఆ భాషలలో సైతం కెరీర్ పరంగా మరింత ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.