ఒకప్పుడు ప్లేట్లు కడిగాడు.. ఇప్పుడు 135వ ర్యాంక్ తో జడ్జి.. మహ్మద్ ఖాసిం సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే

కొంతమంది నిజ జీవితంలో ఉన్న కష్టాలు తెలిసి మనం చాలా సందర్భాల్లో షాకవుతూ ఉంటాం.అలా అందరికీ షాకిచ్చే సక్సెస్ స్టోరీలలో మహ్మద్ ఖాసిం సక్సెస్ స్టోరీ ఒకటి.

 Here Is The Inspirational Story Of Mohammad Qasim Success Details, Mohammad Kasi-TeluguStop.com

యూపీలోని( Uttar Pradesh ) సంభాల్ జిల్లాకు చెందిన మహ్మద్ ఖాసిం( Mohammad Qasim ) జడ్జి కావాలని చిన్నప్పటి నుంచి కలలు కనేవాడు.మహ్మద్ ఖాసిం రేయింబవళ్లు ఎంతో కష్టపడి తన ప్రతిభతో ఆ కలను నిజం చేసుకున్నాడు.

నిరుపేద కుటుంబంలో జన్మించిన ఖాసిం కుటుంబ సమస్యల వల్ల పదో తరగతి తొలి ప్రయత్నంలో పాస్ కాలేదు.

ఆ తర్వాత ఎంతో కష్టపడి పది పాసైన మహ్మద్ ఖాసిం అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో( Aligarh Muslim University ) చేరి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు.2019 సంవత్సరంలో జరిగిన ఎల్.ఎల్.ఎం పరీక్షలో( LLM Exam ) మహ్మద్ ఖాసిం తొలి ర్యాంక్ సాధించారు.అద్భుతమైన ప్రతిభతో మహ్మద్ ఖాసిం సత్తా చాటడంతో పాటు ప్రశంసలు పొందుతున్నారు.

ఒకప్పుడు ప్లేట్లు కడిగిన మహ్మద్ ఖాసిం తన ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు.

Telugu Aligarh, Inspirational, Judge, Judicialcivil, Mohammadkasim, Mohammad Qas

తల్లీదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయిలో సక్సెస్ అయ్యానని మహ్మద్ ఖాసిం చెబుతున్నారు.కొంతకాలం క్రితం యూపీలో జరిగిన జ్యుడీషియల్ సర్వీస్ సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)( Judicial Service Civil Judge ) పరీక్షలో మహ్మద్ ఖాసిం 135వ ర్యాంక్ సాధించారు.మహ్మద్ ఖాసిం కలలు కనడంతో పాటు ఎంతో కష్టపడి ఆ కలలను నెరవేర్చుకున్నారు.

తన ప్రతిభతో మహ్మద్ ఖాసిం ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Telugu Aligarh, Inspirational, Judge, Judicialcivil, Mohammadkasim, Mohammad Qas

మహ్మద్ ఖాసిం సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.తనలా చిన్న వయస్సులోనే ఉన్నత లక్ష్యాలను సాధించాలని భావించే వాళ్ల కలలను మహ్మద్ ఖాసిం నిజం చేసుకుంటున్నారు.మహ్మద్ ఖాసింకు కెరీర్ పరంగా మరిన్ని విజయాలు దక్కాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

మహ్మద్ ఖాసింకు హ్యాట్సాఫ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube