నేటి జీవన విధానంలో నిద్ర లేమి అనేది ఒక సమస్యగా మారింది.మానసిక ఆందోళన, పని ఒత్తిడి, కొన్ని రకాల అనారోగ్య సమస్యల కారణంగా నిద్రలేమి సమస్య వస్తుంది.
కొంతమంది రాత్రి సరిగా నిద్ర పట్టక బాగా లేటుగా పడుకొని ఉదయం చాలా ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు.అలాంటి వారిలో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ సమస్యల నుండి బయట పడటానికి కొన్ని ఆహారాలు ఉన్నాయి.ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో తీసుకుంటే నిద్ర లేమి సమస్య నుండి బయట పడవచ్చు.
వేడి నీటి స్నానమురాత్రి పడుకొనే ముందు వేడి నీటి స్నానము చేస్తే శరీరానికి విశ్రాంతి కలిగి మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది.అలసిన కండరాలకు కూడా విశ్రాంతి లభిస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్,రెండు స్పూన్ల తేనే కలిపి త్రాగాలి.ఈ విధంగా చేయటం వలన అలసట తగ్గి ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
మెంతి నీళ్లురాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మెంతులను వేసి నానబెట్టాలి.మరుసటి రోజు ఉదయం ఆ నీటిని త్రాగితే ఆందోళన తగ్గి నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.
పాలురాత్రి పడుకొనే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనె లేదా దాల్చిన చెక్క పొడి, కుంకుమ పువ్వు వంటి వాటిని కలిపి త్రాగితే హాయిగా నిద్ర పడుతుంది.
అరటి పండురాత్రి భోజనం సమయంలో ఒక అరటిపండును తింటే మంచి ప్రయోజనం ఉంటుంది.
అరటిపండులో పొటాషియం, ఐరన్, కాల్షియంలు సమృద్ధిగా ఉండుట వలన నిద్ర పట్టేలా చేస్తుంది.