లోక్ సభ స్పీకర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.తన హక్కులకు భంగం కలిగించారని పోలీసులపై కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
నడి రోడ్డుపై తన కాన్వాయ్ ను అడ్డుకున్న విషయాన్ని లేఖ ద్వారా కిషన్ రెడ్డి స్పీకర్ కు తెలియజేశారు.కేంద్రమంత్రిని, లోక్ సభ సభ్యుడిని దేశంలో ఎక్కడైనా తిరిగే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు.
అయితే డబుల్ బెడ్ రూం ఇళ్లను పరిశీలించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాటసింగారం వెళ్తుండగా టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్న సంగతి తెలిసిందే.