తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.కాంగ్రెస్ సర్కార్ కేవలం రెండు హామీలను మాత్రమే అమలు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( Palla Rajeshwar Reddy ) అన్నారు.
ఆరు గ్యారెంటీల్లో 13 అంశాలు ఉంటే రెండు అమలు చేశారని పేర్కొన్నారు.రెండు గ్యారంటీలను ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బాగుందన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆటో డ్రైవర్ల జీవితాలు ఆందోళనలో పడిందని ఆరోపించారు.ఈ క్రమంలో ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్ల(Auto drivers )ను ఆదుకోవాలని, వారిని ప్రతినెలా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.