మళ్లీ రామ్‌ చరణ్ నుంచి పిలుపు కోసం కసిగా ఉన్న గౌతమ్‌

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి( Gautam Tinnanuri ) ఆ మధ్య నాని తో రూపొందించిన జెర్సీ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకున్న గౌతమ్‌ తిన్ననూరి ఆ తర్వాత హిందీలో చేసిన జెర్సీ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది అనడంలో సందేహం లేదు.

 Goutham Thinnanuri Want To Do A Movie With Ram Charan After Vijay Devarakonda Mo-TeluguStop.com

హిందీ జెర్సీ హిట్ అయ్యి ఉంటే ఇప్పటి వరకు రామ్‌ చరణ్( Ram Charan ) హీరోగా గౌతమ్‌ తిన్ననూరి సినిమా మొదలు అయ్యేది.ఇప్పటికే అధికారికంగా వీరిద్దరి కాంబో మూవీని యూవీ క్రియేషన్స్ వారు ప్రకటించారు.

Telugu Gautamtinnanuri, Ram Charan, Ramcharan, Telugu-Movie

కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ని క్యాన్సల్‌ చేశాం అంటూ యూవీ క్రియేషన్స్ వారు ప్రకటించారు.చరణ్‌ తో ప్రాజెక్ట్‌ ని మిస్ చేసుకున్న దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో( Vijay Devarakonda ) సినిమాకు రెడీ అవుతున్నాడు.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.తాజాగా ఈ సినిమా గురించి మరో బిగ్‌ ఆసక్తికర విషయాన్ని వెళ్లడించారు.విజయ్ తో గౌతమ్ తిన్ననూరి రూపొందించబోతున్న సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారట.

Telugu Gautamtinnanuri, Ram Charan, Ramcharan, Telugu-Movie

అయితే మొదటి భాగం హిట్‌ అయితేనే రెండవ భాగం ను విడుదల చేస్తామని గౌతమ్‌ సన్నిహితులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.విజయ్ దేవరకొండతో ప్రస్తుతం చేస్తున్న సినిమా ని గౌతమ్ తిన్ననూరి కసి తో చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.ఎందుకంటే రామ్ చరణ్ తో మిస్‌ అయిన సినీ అవకాశం ను మళ్లీ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

ఒక వేళ విజయ దేవరకొండ తో రూపొందిస్తున్న సినిమా ని కనుక దర్శకుడు సూపర్‌ హిట్‌ చేసుకుంటే కచ్చితంగా రామ్‌ చరణ్ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube