ఫాస్ట్ ఫుడ్ ఎందుకు తినకూడదు అంటే!

జీవితం బిజీబిజీగా అయిపోయింది.మరీముఖ్యంగా మహానగరాల్లో ఉండేవాళ్ళ బాధలు వర్ణించడం కష్టం.

 Disadvantages Of Fast Food Effects On Liver Heart-TeluguStop.com

పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళాంటే గంటలకొద్ది ట్రాఫిక్ లో ఉండాలి.రోజంతా పనిచేసి మళ్ళీ గంటలకొద్దీ రద్దిలో ప్రయాణించాలిల.

అందుకే అలసిపోతుంటారు.ఇంటికి వచ్చి, వండుకోని తినేంత ఓపిక చాలాసార్లు ఉండట్లేదు.

అందుకే ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడ్డారు.సాయంత్రం అవగానే అలా ఫాస్ట్ ఫుడ్ తినేయటం లేదా రాత్రి ఇంటివంట కోసం ఎదురుచూసే ఓపిక లేక రెస్టారెంట్లలో వాలిపోతుంటారు.

కాని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే .ఫాస్ట్ ఫుడ్ ఒంటికి మంచిది కాదు అని.ఎందుకు మంచిది కాదు అంటే …

* ఫాస్ట్ ఫుడ్ లో కాలరీలు అతిగా ఉంటాయి.మనకు ఓపూట దొరకాల్సిన దాని కన్నా ఎక్కువ కాలరీలు శరీరంలోకి చేరిపోతూ ఉంటాయి.

ఇక్కడే ప్రమాదం మొదలయ్యేది.

* ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో నాణ్యత లేని నూనె వాడుతున్నారని, మాంసాహారం కూడా తాజాగా ఉండదని ఎన్నో కంప్లయింట్స్ ఉన్నాయి.

అలాంటి వంటకాలకి దూరంగా ఉండటమే మంచిది కదా!

* ఫాస్ట్ ఫుడ్ తరుచుగా తినేవారు అధికబరువు సమస్యలతో బాధపడటం దాదాపు ఖాయం.శరీరంలోకి బాగా కొవ్వుని ఇంజెక్ట్ చేస్తాయి ఫాస్ట్ ఫుడ్ వంటకాలు.

* చాలారకాల ఫాస్ట్ ఫుడ్ పదార్థాల్లో ట్రాస్ ఫ్యాట్ వాడతారట.దీని వలన మన లివర్ పాడయ్యే ప్రమాదం ఎన్నో రేట్లు పెరిగిపోతుంది.ఇది మద్యం తాగడంతో సమానమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

* గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తీవ్రస్థాయిలో పెరుగుతుంది ఫాస్ట్ ఫుడ్ వలన.కోలెస్టరాల్ లెవెల్స్ ని అమాంతం పేంచేయగలదు ఈ ఫాస్ట్ ఫుడ్ తిండి అలవాటు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube