అదేంటి రుచిగా వండుకునే కోడిపుంజు హస్తం ఒక వ్యక్తి హత్యలో ఉండటం ఏంటని ఆలోచిస్తున్నారా.అందులో అది మనిషిని చంపడమేంటని ఆశ్చర్యపోతున్నారా.
అయితే ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.ఆ వివరాలు చూస్తే.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని లొత్తునూర్ గ్రామంలో కోడి పందాలు నిర్వహించేందుకు పందెం రాయుళ్లు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపధ్యంలో వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య(45) అనే వ్యక్తికి కోడి పుంజుకు అమర్చిన కత్తి గుచ్చుకోవడంతో తీవ్రగాయాలు అయ్యాయట.కాగా అతన్ని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మరణించాడట.
అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కోడిపుంజుకు కట్టిన కత్తి కారణంగా ఈ వ్యక్తి మరణించాడని తెలిసిందట.కాగా ఒక వ్యక్తి మరణానికి కారణమైన కోడిపుంజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రచారం.
అయితే ఈ విషయంలో స్పందించిన గొల్లపల్లి ఎస్సై బి.జీవన్, కోడిని కోళ్ల ఫారంలో సంరక్షణ నిమిత్తం అప్పగించామని, అరెస్ట్ చేయలేదని వివరించారట.ఇక మనిషిని మనిషి చంపుకుంటేనే దిక్కులేదు.కోడి విషయంలో మాత్రం ఏం జరుగుతుందని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ అనుకుంటున్నారట.