66 ఏళ్ల వయసులో సుమారు 37 రోజుల్లో 6,000 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన సామాజికవేత్త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పేద పిల్లల చదువుల కోసం నిధుల సేకరణ చేసేందుకు ఆయన ఈ యాత్ర చేపట్టారు.
దాదాపు ఒక నెల రోజుల సమయంలో 6000 కిలోమీటర్లు ప్రయాణం చేశారు.అది కూడా సైకిల్‌పైనే ప్రయాణించడం విశేషం.ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం.66 ఏళ్ల వృద్ధుడు ఈ గొప్ప కార్యాన్ని చేపట్టి అందరి మనసులను గెలుచుకున్నారు.ఆ వ్యక్తి పేరు గగన్ ఖోస్లా.కరోనా మహమ్మారి కారణంగా చదువుకు దూరమైన పేద పిల్లల చదువులను కాంక్షిస్తూ గగన్ ఈ సైకిల్ యాత్ర చేపట్టారు.పేదరికంలో మగ్గిపోతూ వెనుకబడిన పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడానికి గగన్ దేశం నలుమూలలకు వెళ్లి నిధులను సేకరించారు.ఢిల్లీకి చెందిన గగన్ ఖోస్లా తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.
గగన్ ఢిల్లీ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కోల్‌కతా, చెన్నై, ముంబైల మీదుగా దేశంలోని అనేక చిన్న, పెద్ద నగరాలలో పర్యటించారు.
గగన్ ఖోస్నా తన పేరును ఏ రికార్డు పుస్తకంలో నమోదు చేయించుకునే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేపట్టలేదు.పేద, వెనుకబడిన పిల్లల కోసం అతను ఈ సాహసోపేత చర్య చేపట్టారు.
కోవిడ్ కారణంగా పాఠశాల విద్యకు దూరమైన పిల్లల కోసం ఖోస్లా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ విరాళాలు సేకరించారు.ఈ కార్యక్రమంలో అతను సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేశారు.
ఈ సందర్భంగా గగన్ ఖోస్లా మాట్లాడుతూ “2021 సంవత్సరంలో నేను సేవ్ ది చిల్డ్రన్‌ను సంప్రదించాను.నా ఆలోచనను వారితో పంచుకున్నాను.
దీనితో పాటు పిల్లల చదువు కోసం సైకిల్ రైడ్ చేపడతానిని తెలియజేశాను.

ఈ ప్రయాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనైనా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.ఖోస్లా తన ప్రయాణం ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు అతనికి స్వాగతం పలికేందుకు ఒక చోట గుమిగూడారు.ఆరు వేల కిలోమీటర్ల ప్రయాణం సాగించిన గగన్ తన స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయంతో ఈ అపూర్వ కలను నెరవేర్చుకున్నారు.
ఈ ప్రయాణంలో ఆహారం వండడానికి అతనితో పాటు వంటచేసే వ్యక్తి కూడా వచ్చారు.ఆరు లేన్ల రహదారిపై సైకిల్ నడపడం అత్యంత ప్రమాదకరం.అందుకే ఖోస్లా చాలా జాగ్రత్తగా ప్రయాణం సాగించారు.తన ప్రయాణం గురించి ఆయన వివరిస్తూ, ‘సైక్లింగ్‌కు జాతీయ రహదారి అంత సురక్షితం కాదు.
నా ప్రయాణంలో నేను గుజరాత్‌లోని వాపి, బరోడా ప్రాంతాలలో ప్రమాదాల బారిన పడ్డానని అయినా ప్రాణాలతో బయటపడ్డానని తెలిపారు.