ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ( Congress )అధికారంలోకి రావడం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది.
ముందుగా ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడంతోపాటు.మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు.సద్వినియోగం చేసుకుంటున్నారు.
అయితే సంక్రాంతి నేపథ్యంలో ఈనెల 7 నుంచి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులు నడపాలని TSRTC నిర్ణయించింది.అయితే ఈ స్పెషల్ బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందా లేదా అన్నది చాలామందికి సందేహం ఏర్పడింది.ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు.సంక్రాంతి పండుగ సందర్భంగా TSRTC సంస్థ నడుపుతున్న ప్రత్యేక బస్సులలోను మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ సంస్థ కూడా ప్రత్యేకమైన బస్సులు నడుపుతూ ఉంది.తెలుగు పండుగలలో సంక్రాంతి అతిపెద్ద పండుగ.దీంతో వచ్చేవారం వీకెండ్ నుండి సంక్రాంతి సందడి మొదలు కాబోతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు భారీ ఎత్తున స్పెషల్ బస్సులు నడపబోతున్నాయి.