రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువవుతున్నాయి.ఒంటరిగా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఎప్పుడు ఎవరు ఏ రూపంలో దాడి చేస్తారో తెలియడం లేదు.పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఎంత పెద్ద శిక్షలు వేస్తున్న సమాజంలో మార్పు రావడం లేదు.
బయటే కాదు మహిళలకు ఇంట్లో కూడా భద్రత లేకుండా పోతుంది.
సొంత తండ్రే పిల్లల మీద అఘాయిత్యాలు చేస్తుంటే ఇంక ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు.
తండ్రి, సోదరుడు, భర్త ఇలా ప్రతి మగవాడు మహిళపై ఏదొక రూపంలో అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు.తాజాగా హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.
తండ్రిలాగా అనుకుని వెంట వచ్చిన కోడలిపై మామ అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
మామకోడలు వ్యాపారం నిమిత్తం ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చారు.ఇక్కడ తక్కువ ధరలో వస్త్రాలను కొనుగోలు చేసి ఢిల్లీ లో అమ్ముతారు.
అందుకోసమే తన మామతో కలిసి ఆమె హైదరాబాద్ కు వచ్చింది.హబీబ్ నగర్ లో ఒక లాడ్జ్ లో ఉండడానికి రెండు రూమ్స్ ను తీసుకున్నారు.
బుధవారం రోజు రాత్రి సమయంలో కోడలు రూమ్ దగ్గరకు వచ్చి డోర్ కొట్టడంతో మామయ్యే కదా అని లోపలికి రమ్మంది.అయితే అతడు కూతురులా చూసుకోవాల్సిన కోడలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఆమెను బలవంతంగా లొంగదీసుకుని అత్యాచారం చేసాడు.ఈ విషయం ఎవరికైనా చెబితే ఆమెను చంపేస్తానని బెదిరించాడు.
అయితే ఆమె ఈ షాక్ నుండి బయటకు వచ్చాక గురువారం రోజు ఉదయం హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సొంత మామ అని నమ్మి తనతో వచ్చినందుకు కోడలిపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు.