సమ్మర్ లో బీర్ పంపాలంటూ అభిమాని రిక్వెస్ట్.. సోనూసూద్ స్ట్రాంగ్ రిప్లై?

సోనూసూద్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కరోనా అలాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు.

 Fan Asks Sonu Sood To Distribute Beer In Summer, Sonu Sood, Bollywood, Summer Be-TeluguStop.com

కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్.లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించడంతోపాటు వాహనాల్లో వారి వారి గమ్య స్థానాలకు చేర్చాడు.

సోను సూద్ సినిమాలలో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ సాయం కావాలంటూ తనదగ్గరకు వచ్చినవారందరికీ లేదు వాడకుండా అతడికి తోచిన సహాయం చేశాడు.

ఇప్పటికీ సోనూసూద్‌ సహాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా ముద్రవేసుకున్నాడు.

ఒకవైపు సినీమాలలో నటిస్తూ మరొక వైపు అడిగిన వారికీ లేదు అనుకోకుండా సహాయం చేస్తున్నారు సోనుసూద్.ఇకపోతే అన్నింటిలాగానే సోషల్ మీడియాలో సోను సూద్ ఫై, అలాగే సొల్లు చేస్తున్న సోషల్ సర్వీస్ పై కూడా మీమ్స్ వచ్చాయి.

అందుకు సంబంధించిన వాటిలో ఒక మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.ఆ మీమ్ లో చలికాలంలో దుప్పట్లు అందించే వారు చాలామంది ఉంటారు.

అదేవిధంగా వేసవి కాలంలో చల్లని బీరు కూడా పంపిణీ చేస్తే బాగుంటుంది అన్న మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ పోస్ట్ ని ఉద్దేశిస్తూ సోను సూద్ అభిమాని ఆ మీమ్ ని షేర్ చేసాడు.సదరు అభిమాని షేర్ చేసిన ఆ మీమ్ ఫై సోను స్పందిస్తూ.బీర్ తో పాటుగా స్టఫ్ కూడా ఉంటే బాగుంటుంది అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చాడు సోను సూద్.

ఇందుకు సంబందించిన రిప్లై కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube