భాగ్యనగరంలో ప్రముఖ స్వీట్ల వ్యాపారి మృతి..!

తెలంగాణలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.కరోనా కారణంగా చాల మంది ప్రాణాలను కొల్పోయారు.

తాజాగా ప్రముఖ స్వీట్స్ షాపు ఫ్రాంచైజీ యజమాని కూడా గురువారం రాత్రి కోవిడ్‌కు బలైయ్యారు.అయితే యజమాని కొద్దీ రోజుల క్రితం అబిడ్స్‌లో జరిగిన ఆ పార్టీలో పాల్గొన్నారు.

అక్కడ వారు ఎలాంటి నిబంధలను పాటించలేదని సమాచారం.అయితే ఈ వేడుకకు హాజరైన వారంతా కరోనా బారిన పడి హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

కొందరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.దింతో వ్యాపార సంస్థతో ఆందోళన స్టార్ట్ అయ్యింది.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే.పాతబస్తీకి చెందిన ఓ జ్యువెలరీ షాపు యజమాని కూడా ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గురువారం మరణించారు.

ఆయనకు కూడా కరోనా ఉందా.? ఆయన కూడా ఈ నిశ్చితార్థంలో పాల్గొన్నారా అనేది తెలియలేదు.కరోనాతో మరణించి వ్యక్తి కుటుంబం మొదట నగరంలోని గుల్జార్ హౌస్ వద్ద స్వీట్ షాపును తెరిచింది.

తర్వాత బంజారాహిల్స్ మసాబ్ ట్యాంక్ రోడ్‌లో మరో స్వీట్ షాప్ తెరిచారు.వీరికి నగరంలోని 9 ప్రాంతాల్లో స్వీట్ షాపులున్నాయి.వీరి సమీప బంధువులు సూపర్ మార్కెట్లను నిర్వహిస్తున్నారు.

పార్టీలు, ఫంక్షన్లలో పాల్గొని కరోనా వైరస్ సోకడంతో గత కొద్ది రోజుల్లో నగరానికి చెందిన ఐదుగురు ఆభరణాల వ్యాపారులు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.కరోనా దెబ్బతో వ్యాపార వర్గాలు కలవరానికి గురవుతున్నాయి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

కానీ కొందరు మాత్రం కరోనా వల్ల తమ వాళ్లు చనిపోలేదని, వేరే అనారోగ్య కారణాల వల్ల మరణించారని చాలా కుటుంబాలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు