సాధారణంగా పల్లెటూర్లలలో బాతులు, కోళ్లను పెంచుకుంటుంటారు.వాటికి సమయానికి గింజలు పెడుతూ ప్రేమతో సాకుతుంటారు.
ఇవి కూడా యజమానుల పట్ల కృతజ్ఞత భావంతో ఉంటాయి.ఎవరైనా కొత్త వ్యక్తి ఆ దరిదాపుల్లోకి వస్తే అరవడమో లేక వారిని అడ్డగించడమో చేస్తాయి.
ఒక్కోసారి దాడి కూడా చేస్తాం.తాజాగా ఇలానే ఓ అమ్మాయిపై కోడి, బాతు కలిసి దాడి చేశాయి.
దీంతో అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి పరుగులు తీసింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో ప్రకారం… ఇంటి ముందు ఉన్న స్థలంలో కోడి, బాతు ఉన్నాయి.అవి గింజలను తినే సమయంలో ఓ అమ్మాయి అటుగా వచ్చింది.
దీంతో బాతుకు కోపం వచ్చిందో తెలియదు గానీ, ఒక్కసారిగా ఆ అమ్మాయి కాలిపై ముక్కుతో దాడి చేసింది.దీంతో ఈ పరిణామాన్ని ఊహించని అమ్మాయి ప్రతి ఘటించడానికి ప్రయత్నించింది.
ఇంతలో అప్పటి వరకు గింజలను తింటున్న కోడిపుంజు కూడా ఆమెపైకి దాడి చేసేందుకు వచ్చింది.దీంతో బాతు, కోడిపుంజు దాడి చేయడంతో సదరు అమ్మాయి బోరున విలపించింది.
వెంటనే ఇంట్లోకి పరుగులు పెట్టింది.బాతు, కోడి దాడి చేయడం మొదలు పెడితే తట్టుకోవడంఎవరికైనా కష్టమే అని చెప్పాలి.
ఈ యువతి కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంది.ఓ వైపు బాతు, మరో వైపు కోడిపుంజు రెండూ కలిసి యువతికి చుక్కలు చూపించాయి.అవి చేసిన దాడికి తట్టుకోలేక ఆ యువతి ఏడ్చేసింది.వాటి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది.
ఈ ఫన్నీ వీడియో ఎర్త్ డిక్స్ అనే ఇన్‌స్టాగ్రమ్ ఐడీలో పోస్ట్ కాగా, వైరల్ గా మారింది.ఈ వీడియోను ఇప్పటికే 11 మిలియన్ల మంది చూశారు.2 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.