రివ్యూ : 'దొంగ' గా కార్తి మళ్లీ మెప్పించాడా?

ఇటీవలే ‘ఖైదీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ హీరో కార్తి ఏమాత్రం గ్యాప్‌ లేకుండా ఈసారి ‘దొంగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 Donga Movie Telugu Review And Rating-TeluguStop.com

అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జీతూ జోషెఫ్‌ తెరకెక్కించాడు.దృశ్యం చిత్రంతో ఈయన సెన్షేషన్‌ క్రియేట్‌ చేశాడు.మళ్లీ ఈ చిత్రంతో మెప్పించాడా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

15 సంవత్సరాల క్రితం శర్వా తప్పిపోతాడు.అతడి కోసం కుటుంబ సభ్యులు వెదుకుతూ ఉంటారు అలాంటి సమయంలో నేనే శర్వా అంటూ ఒక దొంగ కార్తి వస్తాడు.అతడే శర్వా అంటూ అంతా నమ్ముతారు.

కాని అతడి అక్క జ్యోతిక మాత్రం నమ్మదు.శర్వా తండ్రి దొంగను తన రాజకీయ వారసుడిగా చేసేందుకు జ్యోతిక ఒప్పుకోదు.ఇంతకు ఆ శర్వా ఈ దొంగ ఒక్కరేనా చిన్నతనంలో శర్వా ఎందుకు ఎలా మిస్‌ అయ్యాడు అనేది సినిమా చూసి తెలుసుకోండి.

నటీనటుల నటన :

హీరో కార్తి మరోసారి ఒక చక్కని నటనతో ఆకట్టుకున్నాడు.ముఖ్యంగా ఈ చిత్రంలో కార్తి నటన విభిన్నంగా ఉంది.ఒక దొంగగా కన్నింగ్‌ కుర్రాడిగా అమాయకుడిగా ఇలా షేడ్స్‌ మారుస్తూ కార్తి నటించిన తీరు ఆకట్టుకుంది.ఇక ఎప్పటిలాగే యాక్షన్‌ సీన్స్‌తో కార్తి దుమ్ము రేపాడు.హీరోయిన్‌గా నటించిన నిఖిల విమల్‌ కు పెద్దగా ప్రాముఖ్యత దక్కలేదు.

ఆమె ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.పాటల్లో స్కిన్‌ షో చేసింది.

ఇక జ్యోతిక సినిమాలో చాలా కీలక పాత్రలో కనిపించింది.ఈమె ఎక్కువగా సీరియస్‌గానే కనిపించింది.

తమ్ముడి కోసం ఆరాటపడే అక్క పాత్రలో జ్యోతిక మంచి నటనతో మెప్పించింది.సత్యరాజ్‌ మరియు ఇతరులు కూడా వారి పాత్రల పరిధిలో నటించి మెప్పించారు.

Telugu Donga Review, Donga Movi, Donga Day, Donga, Jyothika, Karthi-Movie Review

టెక్నికల్‌ :

గోవింద వసంత అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు.పాటలు తమిళ ఫ్లేవర్‌ను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా ఈ సినిమాలోని నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది.పాటలు మినహాయిస్తే గోవింద వసంత అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది.ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలున్నాయి.ముఖ్యంగా కార్తి కన్నింగ్‌గా వ్యవహరించే సీన్స్‌ లెంగ్త్‌ మరీ ఎక్కువ అయ్యింది.

ఆ సీన్స్‌ను కాస్త ట్రిమ్‌ చేసి ఉంటే బాగుండేది.ఇక సినిమాటోగ్రఫీ బాగుంది.

పాటలు మరియు యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణలో సినిమాటోగ్రఫీ కీలకంగా వ్యవహరించినట్లయ్యింది.ఇక దర్శకుడు జీతూ సోషెఫ్‌ తన గత చిత్రాల మాదిరిగానే విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించాడు.నిర్మాణాత్మక విలువలు కథానుసారంగా ఉన్నాయి.

విశ్లేషణ :

దృశ్యం చిత్రంతో సక్సెస్‌ ను దక్కించుకున్న దర్శకుడు జీతూ జోషెఫ్‌ ఈ చిత్రంతో మరో విభిన్నమైన సక్సెస్‌ అందుకునేందుకు ప్రయత్నించాడు.అయితే దృశ్యంతో పోల్చితే ఈ చిత్రం కాస్త స్క్రీన్‌ప్లే పరంగా నిరాశపర్చిందని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ను ఈ చిత్రంలో జొప్పించేందుకు ప్రయత్నించి కథ గమనంను కాస్త దెబ్బ తీసినట్లుగా అనిపించింది.

అక్క తమ్ముడి సెంటిమెంట్‌ను ఇంకాస్త పండిస్తే బాగుండేది.సినిమాలో అక్క పాత్రకు జ్యోతికను తీసుకోవడంతో చాలా మంచి నిర్ణయం.

ఆమె ప్రజెన్స్‌తో సినిమా స్థాయి పెరిగి పోయింది.మొత్తంగా తమిళ ప్రేక్షకులు ఆహా ఓహో అన్నట్లుగా ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఒక మోస్తరుగా ఉన్నట్లుగా అనిపించింది.

ప్లస్‌ పాయింట్స్‌ :

కార్తి మరియు జ్యోతిక,కొన్ని యాక్షన్‌ సీన్స్‌,కథలో ట్విస్ట్‌

మైనస్‌ పాయింట్స్‌ :

తమిళ ఫ్లేవర్‌ ఎక్కువ అయ్యింది,సంగీతం ఆకట్టుకోలేదు,స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌

బోటమ్‌ లైన్‌ :

‘దొంగ’ కొందరి హృదయాలను మాత్రమే దోచుకున్నాడు.

రేటింగ్‌ : 2.5/5.0

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube