వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా టింలోకి అడుగుపెట్టిన మహేంద్రసింగ్ ధోని అతి తక్కువ టైంలో కెప్టెన్ స్థాయికి ఎదిగారు.ఆయన సారధ్యంలో భారత్ అన్ని ఐసీసీ ట్రోఫీలను సాధించి రికార్డులను తిరగరాసింది.
మరి అలాంటి ధోని సడన్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్ కి గురి చేశారు.దానితో ఇకనుండి మనం ధోనిని కేవలం ఐపీఎల్లో మాత్రమే చూడగలము.
ఇక ఈరోజు యూఏఈ వేదికగా మొదలవ్వనున్న ఐపీఎల్ లో రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, ధోని సారథ్యం వహిస్తున్న సీఎస్కే రాత్రి 7:30 గంటలకి తలపడనున్నాయి.దానితో క్రికెట్ ఫాన్స్ ఈ మ్యాచ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి టైంలో చైనాకు చెందిన ఒప్పో కంపెనీ ధోని తమతో చేసిన ఓ యాడ్ ను విడుదల చేసింది.చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న టైంలో చైనా కంపెనీతో ధోని ఒప్పందం కుదుర్చుకోవడం ఏంటని ఫ్యాన్స్ ధోనీపై విమర్శలు సంధిస్తున్నారు.
మరి వీటిపై ధోని ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.