గత ఏడాది జనవరిలో వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలడంతో అతని స్థానంలో జట్టు పగ్గాలని విరాట్ కోహ్లీ అందుకున్నాడు.అప్పటి నుంచి ఒకవేళ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే అతనికి బదులుగా టెస్టుల్లో రహానె.
వన్డే, టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటూ వస్తున్నారు.కానీ ఆఫ్గనిస్తాన్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ధోని కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించాడు.200 వ మ్యాచ్ అతను కెప్టెన్ గా చేయడంతో ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
మైదానంలో ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా వ్యవహరించే టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికి కోపమొచ్చింది.
ఆసియాకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.తనదైన కెప్టెన్సీతో భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ధోని.ఫీల్డింగ్ సెట్ చేసే విషయంలో బౌలర్లను అంతగా అనుమతించడు.అయితే, ఫీల్డర్‌ను తను చెప్పిన చోట కాకుండా.
వేరే చోటుకు మారుస్తున్న కుల్దీప్‌పై ధోని అసహనం వ్యక్తం చేశాడు.‘బౌలింగ్ చేస్తావా.! లేదా మరో బౌలర్‌ని పిలవాలా.!’అంటూ వ్యాఖ్యానించాడు.
ఫీల్డర్‌ను మార్చాల్సిందిగా కుల్‌దీప్ పదే పదే అడుగుతుండటం.దానికి ధోనీ ఇచ్చిన సమాధానం స్టంప్ మైక్రోఫోన్‌లో వినిపించడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
దీనిని ట్విటర్‌లో నెటిజన్లు విపరీతంగా షేర్ చేశారు.
watch video:
ఫీల్డ్‌లో ఎంతో సాఫ్ట్‌గా, కూల్‌గా కనిపించే ధోనీ.ప్లేయర్స్ విషయంలో మాత్రం కాస్త కఠినంగానే ఉంటాడు.వాళ్లపై తనదైన ైస్టెల్లో సెటైర్లు వేస్తుంటాడు.
గతంలోనూ ఓసారి శ్రీశాంత్‌కు ధోనీ ఇలాగే వార్నింగ్ ఇచ్చాడు.ఓయ్ శ్రీ అక్కడ నీ గర్ల్‌ఫ్రెండ్ లేదు.
కొంచెం ఇక్కడికి రా.అంటూ ధోనీ అనడం అభిమానులను ఆకట్టుకుంది.అయితే కొంతమంది మాత్రం ధోనిని విమర్శిస్తున్నారు.బౌలర్ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు అని విమర్శిస్తున్నారు.