రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్‌కి పోటీ వచ్చేస్తుందోచ్.. ఆ వివరాలివే!

మోడర్న్-క్లాసిక్ బైక్ సెగ్మెంట్‌కి ఇండియాలో విపరీతమైన డిమాండ్ నెలకొంది.ఈ తరహా బైక్‌లను రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారు చేస్తూ చాలామందిని ఆకట్టుకుంటుంది.

 Competition Is Coming To Royal Enfield Hunter That's The Details , Keeway Bike,-TeluguStop.com

ఈ కంపెనీ ఇండియాలో మిడిల్-వెయిట్ ప్రీమియం బైకింగ్ విభాగంలో టాప్ ప్లేస్‌లో ఉంది.అయితే డిమాండు ఉన్న ఈ సెగ్మెంట్‌లో కొత్తగా బైక్స్ రిలీజ్ చేసి తాను కూడా పాపులర్ కావాలని హంగేరియన్ బ్రాండ్ కీవే ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా 2023, జనవరి రెండో వారంలో జరగనున్న ద్వైవార్షిక ఆటో షోలో భారతదేశంలో SR 250 బైక్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

కొత్త కీవే SR 250 బెస్ట్ సెల్లింగ్ బైక్ అయిన హంటర్ 350 మోటార్‌సైకిల్‌కు పోటీగా రానుంది.

ఇది చిన్న SR 125 మోటార్‌సైకిల్‌ను పోలి ఉండే మోడర్న్-క్లాసిక్ డిజైన్‌తో వస్తుంది.దీనిలో స్పోక్ వీల్స్, బ్లాక్-ప్యాటర్న్ టైర్లు, ఫ్రంట్ ఫోర్క్ గైటర్‌లు, ఆఫ్-సెట్ రౌండ్ కన్సోల్, రిబ్బెడ్-ప్యాటర్ సీటు వంటి కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.250cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ తో వచ్చే ఈ బైక్ 25-28 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం.టార్క్ పవర్ ఎంత ఉంటుందనేది ఇంకా తెలియ రాలేదు.

ఈ అప్‌కమింగ్ బైక్ గేర్‌బాక్స్‌లో 5-స్పీడ్ గేర్స్‌ ఇవ్వనున్నారు.

కీవే SR 250లో సింగిల్ డౌన్‌ట్యూబ్ ఛాసిస్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, డ్యూయల్ స్ప్రింగ్‌లు, డిస్క్ బ్రేక్ కూడా ఉండనున్నాయి.భారతీయ మార్కెట్లో లాంచ్ అవ్వగానే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350, TVS రోనిన్, కవాసాకీ W175 వంటి బైక్స్‌కి పోటీగా నిలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube