నేల మానవునికి ప్రకృతిసిద్దంగా లభించిన సహజ సంపద.సహజ వనరులలో నేల అతి ప్రధానమైనది.
సమస్త జీవరాశుల మానవాళి మనుగడ నేలపై ఆధారపడి ఉంది .వ్యవసాయ ప్రధాన దేశాలకు నేల తల్లి వంటిది.అందుకే భారతీయులు నేలను “భూమాత” అని పిలుస్తారు.పంటలు పండించడానికి అవసరమయ్యే తేమ’ పోషకాలు ‘సూక్ష్మ జీవులు తమలో ఇముడ్చుకుని మొక్కలకు అవసరమైన మేరకు అందిస్తుంది.నేల ఆహారం కొరకే కాకుండా జాతి సౌభాగ్యానికి దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.నేలల ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిమీద వుంది.
ఆధునిక రోజుల్లో నేలల కోతను తగ్గించే దిశగా కృషి జరుగుతోంది.నేలల సారవంతాన్ని రక్షించడం వల్ల ఆహారభద్రత కలిపించవచ్చు .నేలలు వివిధ అనుపాతాల్లో ఖనిజ లవణాలు సేంద్రియ పదార్థాలు,గాలిలొ నిర్మితమై ఉంటాయి .మొక్క ఎదుగుదలకు ఎంతో దొహదపడుతాయి.నేలలోలో ఉన్న బంక మన్ను’ఒండ్రు ఇసుక.రేణువులతో పాటు సేంద్రియ పదార్థం అలాగే గాలి నీరు సూక్ష్మజీవులు ఇతరక్రిమి కీటకాలు వానపాములు ఇతరత్రా పురుగులు ఉంటాయి.
రసాయనికంగా ఉండే లవణాల పరిమాణం ఉదజని సూచిక పోషకాల లబ్యత సూక్ష్మజీవుల చర్య ఇవన్నీమొ క్కల పెరుగుదల దిగిబడులు తద్వారా ఉత్పాదక శక్తిపై ప్రభావం చూపిస్తాయి.ఈ లక్షణాలన్నీ భూసారాన్ని తెలిపే సూచికలు .ఇవి భూమిలో ఎంత శాతం ఉన్నాయి.పంటకి ఎంత అవసరం ఏ విధంగా అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
మొదలైన విషయాలు భూసార పరీక్షలు ద్వారా తెలుసుకోవాలి.
నేలలు అనేక కీటకాలకు జీవులకు ఆవాసంగా ఉంటాయి.
ఆహారం ,దుస్తులు ఆశ్రయం ‘వైద్యంతో సహా నాలుగు ముఖ్యమైన సజీవ కారకాలకు నేలలే మూలం.కాల క్రమేణ నేలల సంరక్షణ ప్రాముఖ్యత సంతరించుకుంది.
ప్రపంచ సాయిల్ డే”2002 లో ప్రారంభమైంది .అంతర్జాతీయ సాయిల్ సైన్స్ అసోసియేషన్” దీనిని జరుపుకోవడానికి ఇవాళ ప్రపంచ నేలల దినోత్సవంగా ప్రకటించింది.నాటి నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.2013 డిసెంబర్ లో68 వ సెషన్ లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ “డిసెంబర్5 ను మొదటి మట్టిదినోత్సవంగా ప్రకటించింది.ప్రపంచ వ్యాప్తంగా మట్టి నేలల మీద అవగాహన చైతన్యం కలిగించి ఆరోగ్య వంతమైన పర్యావరణ వ్యవస్థ మరియు మానవసంక్షేమం పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

నేలలు సారవంతంగా ఉన్నప్పుడే పంటలు పుష్కలంగా పండుతాయి.పంటల తీరును నిర్ణయించడంలో నీలలతీరు’ నేలల స్వభావం ‘నీటి లభ్యత ప్రధాన పాత్ర వహిస్థాయి.వ్యవసాయం లాభసాటిగా మారుతుంది .అన్నదాతల ఆత్మహత్యలు తగ్గుతాయి.వ్యవసాయ రంగం ప్రగతి సాధిస్తే వ్యవసాయ అనుబంధ రంగాలలో పురోగతి సాధ్యమౌతుంది.“రైతే రాజు” అనే నినాదానికి సార్థకత చేకూరుతుంది.ఆర్థిక్యవస్థ లో మిగతా రంగాలు పురోగమిస్థాయి.
ఇది జగమెరిగిన సత్యం.అయితే అవగాహన లోపంతో నేల’ నీరు ‘కలుషితం అవుతుంది.నేలను’ నీటిని సంరక్షించే చర్యల పట్ల ప్రజలు’ ప్రభుత్వం అంతగా శ్రద్ధ చూపడం లేదు.నేల స్వభావాన్ని సంరక్షించాలనే ఉద్దేశంతో 2013 నుండి డిసెంబర్ ప్రపంచవ్యాప్తంగా నేలల దినోత్సవం నిర్వహిస్తారు.
ఈ క్రమంలో నేలలు రక్షణ నీటి సంరక్షణ అందుకు అవసరమైన పద్ధతులపై చర్చలు’ సమావేశాలు సదస్సులు వర్క్ షాపులను నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు నిర్వహిస్తాయి.

ఇటీవలప్రపంచ వ్యాప్తంగా ప్రపంచీకరణ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ వాణిజ్యపరమైన ఆలోచనలు రాజ్యమేలటం వల్ల అధిక దిగుబడుల పేరుతో “అత్యాశతో” పంటలకు అవసరం ఉన్నా’.లేకున్నా విచక్షణా రైతాంగం రసాయనిక ఎరువులను’ పురుగు మందులను వాడటం వల్ల నేల కాలుష్యమైంది.రైతులు పండించే కూరగాయలు పండ్లు’ పాలు‘ కలుషితమై ప్రజలు అనేక ఆరోగ్య సమస్య లు ఎదుర్కొంటున్నారని పలు వైద్య ఆరోగ్య సర్వేల్లో తేలింది.
ప్రకృతి వైపరీత్యాల వల్లనేలల భౌతిక లక్షణాలలో మార్పు రావడం.భూసారము క్రమంగా తగ్గిపోవడం.పోషకాలు లేని నిస్సారమైన పంటలు పండడం.పండిన పంటలో తగినంత ప్రమాణం లోపోషకాలు లేకపోవడం .ఆహార పదార్థాలలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉండడం.పంటల కాలుష్యం: వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యం ప్రమాదస్థితికి చేరుకుంది .భావితరాలకు సారవంతమైన నేలలు అందించలేని దుస్థితి నెలకొంది .రాబోయే కాలంలో వ్యవసాయ రంగం మనుగడ ప్రశ్నార్ధకంగా మిగిలింది.నేలతో పాటు నీటి సంరక్షణ చర్యలను తీసుకున్నప్పుడే వ్యవసాయ అభివృధి సమాజాభివృద్ధి సాధ్యమౌతుంది.