అమెరికాలో పోలీస్ కు, దొంగకు మధ్య జరిగిన ఓ సంఘటన ఈ ఏటి మేటి ఘటనగా మిగిలిపోతుంది.పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ కు దొంగ ఇచ్చిన రిప్లై నవ్వు పుట్టిస్తే ఆ తరువాత జరిగిన తతంగం మొత్తం మాంచి కామెడి సినిమాను తలపిస్తుంది.
ఏది ఏమైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో అమెరికా దొంగా, పోలీస్ జరిగిన ఈ కామెడీ ట్రాక్ ఫుల్ వైరల్ అవుతోంది.ఇంతకీ ఏం జరిగింది, దొంగ పోలీస్ మధ్య గొడవలో ఎవరు గెలిచారు అనే వివరాలలోకి వెళ్తే.
అమెరికాలోని జార్జియాలో పోలీసులు టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్టు ను సిద్దం చేసి దాన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, యాడ్స్ వేయించారు, అలాగే సోషల్ మీడియాలో కూడా వారి లిస్టు ను ఫోటోలతో సహా పోస్ట్ చేశారు.ఇది కాస్తా వైరల్ అయ్యింది.
దాంతో పోలీసులు పెట్టిన ఈ పోస్ట్ కు క్రిస్టోఫర్ అనే అనే దొంగ మీరు పెట్టిన పోస్ట్ లో నా పేరు లేదు ఏంటి అంటూ పోలీసులను ప్రశ్నించాడు.దాంతో చిర్రెత్తు కొచ్చిన పోలీసులు ఘాటుగానే రిప్లై ఇచ్చారు.
అవును నిజమే నీలాంటి నిజాయితీ గల దొంగ కోసమే మేము వెతుకుతున్నాము, నీ పై కూడా రెండు వారెంట్ లు ఉన్నాయి వస్తున్నాం అక్కడే ఉండూ అంటూ బదులు ఇచ్చారు.అలా అన్నారో లేదో.

క్రిస్టోఫర్ ఉండే ప్రాంతానికి వెళ్లి మరీ అతడిని పట్టకుని అరెస్ట్ చేసేశారు.అంతేకాదు పోలీసులు అతడిని ఓ ఫోటో తీసి గత పోస్ట్ తాలూకు కామెంట్స్ స్క్రీన్ షాట్స్ తీసి మరీ మరొక పోస్ట్ పెట్టారు.అదేంటంటే నిన్ను పట్టుకోవడంలో నీ నీ సహాయాన్ని మేము మరిచిపోలేం, నీ కామెంట్ ఆధారంగానే నువ్వు దొరికావు నీకు అభినందనలు ఇకపై అంతా మంచే జరుగుతుంది అంటూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు.ఈ మొత్తం వ్యహారంపై నెటిజన్లు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పట్టలేని నవ్వు మేము నవ్వాము, ఇలాంటి అరుదైన సంఘటనలు మన దగ్గర జరగడం సరదాగా ఉందంటూ అమెరికన్స్ కామెంట్స్ చేస్తుంటే, మేము నవ్వు ఆపుకోలేక పోతున్నాం ఆ దొంగను చూస్తుంటే అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.