జగన్ ఏదైనా అనుకున్నారంటే సాధించే వరకు వదిలిపెట్టరు.పార్టీ స్థాపించిన దగ్గర నుంచి దానిని అధికారంలోకి తీసుకువచ్చే వరకు జగన్ పట్టుదలేమిటో అందరికీ తెలిసిందే.
రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్( CM Jagan ) చాలా ఎత్తుగడలే వేస్తున్నారు.పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి వై నాట్ 175 అనే నినాదాన్ని నిజం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు.చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన అసంతృప్తి ఉందనే విషయాన్ని జగన్ గుర్తించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక సర్వేలు చేయించారు.
అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్టులను బేరీజు వేసుకుని నియోజకవర్గాల్లో ఇన్చార్జిల( Constituency Incharges ) మార్పుకు శ్రీకారం చుట్టారు.
జనవరి 10 నాటికి ఈ ప్రక్షాళన పూర్తి చేసి పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక చేపడుతున్నారు.
ఇక కొన్ని కీలకమైన స్థానాల్లో టిడిపి, జనసేన కూటమి అభ్యర్థుల ఎంపిక తర్వాత మార్పు చేర్పులు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.ఏది ఏమైనా జనవరి 20వ తేదీ నాటికి అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.

ఫిబ్రవరి చివరి వారంలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశాలను( Assembly Meeting ) నిర్వహిస్తారు.ఇవి మార్చి ఐదు నుంచి పదిలోపు ఉంటాయి.ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్( Elections Schedule ) వెలువడనుంది.దీనిని దృష్టిలో పెట్టుకుని జగన్ ముందడుగు వేస్తున్నారు.తాను జనాల్లోకి రావడం లేదని, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కే పరిమితం అవుతున్నానంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో, జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు విస్తృతంగా చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

అలాగే భారీ సభలు, ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇప్పటికే రంగంలోకి దిగారు.తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేస్తూ జనాల్లోకి ఆ విమర్శలు వెళ్లే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు.వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, నిర్ణయాలే తమను మళ్ళీ అధికారంలో కూర్చోబెడతాయనే నమ్మకంతో జగన్ ఉన్నారు.
ఆ దిశగానే ముందడుగు వేస్తున్నారు.