నేడు వైసీపీ ఎమ్మెల్యే లకు జగన్ చివరి హెచ్చరిక ఏంటంటే ?

రాబోయే సార్వత్రిక ఎన్నికలను వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2019 ఎన్నికల మాదిరిగా 2024 లో పరిస్థితులు ఉండవని, గట్టిగా కష్టపడితే తప్ప ఫలితం అనుకూలంగా ఉండవనే విషయాన్ని జగన్ గ్రహించారు.ఎన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందినా, నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా ఫలితాలు ఉంటాయనేది జగన్ ఎప్పుడో గ్రహించారు.అందుకే ఒకపక్క పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూనే, ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు.

 Cm Jagan Last Warning To Mlas Gadapa Gadapaku Mana Prabhutvam Campaign Details,-TeluguStop.com

నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలని,  ఎక్కడా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ సూచిస్తూనే,  క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి మాత్రమే రాబోయే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తామని జగన్ పదేపదే చెబుతున్నారు.

ఇక ఎమ్మెల్యేలను ప్రజలకు మరింత దగ్గర చేసే విధంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.అయితే చాలాచోట్ల ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించడం పై జగన్ సీరియస్ గానే ఉన్నారు.

ఇప్పటికే దీనిపై అనేక సర్వేలు చేయించారు.ఇంటింటికీ సరిగ్గా తిరగని ఎమ్మెల్యేల లిస్టు రెడీ చేసుకున్నారు.

Telugu Ap, Ap Cm Jagan, Gadapagadapaku, Jagan, Ycp, Ycp Schemes, Ysrcp, Ysrcp Ml

నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై వైసీపీ ఎమ్మెల్యేలు,  ఆ పార్టీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో జగన్ నేడు సమావేశం కానున్నారు.ఈ సందర్భంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోకుండా,  తూతు మంత్రంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలకు జగన్ చివరి హెచ్చరిక చేసే అవకాశం ఉన్నట్లు వైసిపి కీలక నాయకులు చెబుతున్నారు.వాస్తవంగా గత వారం ఈ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నా, కొన్ని సంఘటనల కారణంగా దానిని వాయిదా వేశారు.అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చి జనాల్లోకి వెళ్లే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube