టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాఱ్ పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు రాష్ట్రాన్నే కాదు కుప్పం నియోజకవర్గాన్ని సైతం ఏనాడూ పట్టించుకోలేదని మండిపడ్డారు.
టీడీపీకి చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేదని సీఎం జగన్ అన్నారు.అనంతరం పవన్ పై ధ్వజమెత్తిన ఆయన నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ పవన్ అని విమర్శించారు.
తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నానని పవన్ అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు.అలాగే పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్కకి పడిన ఓట్లు కూడా జనసేనకు పడలేదన్నారు.ఆయనకు సొంత నియోజకవర్గం కూడా లేదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పాలన ఉన్న సమయంలో ఉద్దానం బాధితులను పట్టించుకోలేదని మండిపడ్డారు.