ఓ వ్యక్తి ఆహారంలో విషం( Poison ) కలిపి తన భార్యకు తినిపించి చంపేశాడు.ఆ తర్వాత హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయిందని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
కానీ మృతురాలి బంధువులకు అనుమానం రావడంతో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.హత్యకు గల కారణాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.కర్ణాటకలోని( Karnataka ) చిక్కమగళూరు జిల్లా కు చెందిన దర్శన్(34), శ్వేత (32) లకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరిద్దరూ ల్యాబ్ టెక్నీషియన్లు కావడంతో బెంగళూరులోని శివమొగ్గ లో ల్యాబ్ నిర్వహిస్తున్నారు.అయితే దర్శన్( Darshan ) మరో యువతితో చనువుగా ఉండడం చూసిన శ్వేత( Shweta ) భర్తను గట్టిగా మందలించింది.
దర్శన్ లో మార్పు రాకపోవడంతో ఇక ఈ దంపతుల మధ్య తరచూ గొడవలే.

భార్యను చంపేసి, అకస్మాత్తుగా గుండెపోటు కారణంగా మరణించినట్లు క్రియేట్ చేయాలని దర్శన్ ఓ సరికొత్త ప్లాన్ రచించాడు.ప్లాన్ లో భాగంగా ఓ రెండు రోజులపాటు తాను మారినట్లు భార్యతో చాలా ప్రేమగా నడుచుకున్నాడు.మంచి అవకాశం కోసం ఎదురుచూసి ఈనెల తొమ్మిదవ తేదీ రాత్రి రాగి సంకటిలో విషం కలిపి భార్యకు తినిపించాడు.
కాసేపటికి శ్వేత మరణించింది.ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె బంధువులకు ఫోన్ చేసి శ్వేత గుండెపోటుతో చనిపోయిందని( Heart Attack ) సమాచారం ఇచ్చాడు.

అయితే శ్వేత పుట్టింటి వారికి దర్శన్ పై అనుమానం వచ్చింది.కాస్త గట్టిగా నిలదీయగా దర్శన్ అక్కడి నుంచి జారుకున్నాడు.చుట్టుపక్కల ఉండే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పరారీలో ఉన్న దర్శన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.మొదట సిరంజీ ద్వారా విషం ఎక్కించి చంపాలని నిర్ణయించుకున్నట్లు, అది విఫలం కావడంతో రాగిసంకటిలో విషం కలిపి ఆమెకు తినిపించి చంపేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు.
పోలీసులు దర్శన్ ను రిమాండ్ కు తరలించారు.







