హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్‌

టాలీవుడ్‌ లో గడిచిన నాలుగు శతాబ్దాలుగా తిరుగులేని ఆదిపత్యం కనబర్చుతున్న మెగాస్టార్‌ చిరంజీవి ఎంతో మంది యంగ్‌ స్టార్‌ హీరోలకు ఆదర్శంగా నిలిచారు.ఆయన ఫ్యామిలీ నుండి అరడజనుకు పైగా మంది సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.

 Happy Birthday Megastar Chiranjeevi, Chiranjeevi,happy Birthday, Plasma Donate,-TeluguStop.com

టాలీవుడ్‌ ను చిరంజీవిని విడదీసి మాట్లాడలేం.అంతగా టాలీవుడ్‌లో పెనవేసుకు పోయిన మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా నిజంగా గొప్ప విషయం.

రక్త దానం, అవయవ దానం ఇప్పుడు ప్లాస్మా దానం గురించి చిరంజీవి చేస్తున్న ప్రచారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తన సినీ కెరీర్‌ లో ఎన్నో అద్బుతమైన విజయాలను దక్కించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి మరే హీరోకు భవిష్యత్తులో సైతం సాధ్యం కాని రికార్డులను ఎన్నో నమోదు చేశాడు.

ఒకానొక సమయంలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న స్టార్‌గా పేరు దక్కించుకున్నారు.ఆయన ఇండియాలో కోటి పారితోషికం తీసుకున్న స్టార్స్‌గా నిలిచాడు.

మెగాస్టార్‌ చిరంజీవి ఆరున్నర పదుల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఆయన ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని చేస్తున్నాడు.

రాజకీయాల కారణంగా దాదాపుగా పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ అయ్యింది.అన్నేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చినా చిరంజీవిని మునుపటి మాదిరిగానే ఆధరించారు.ఇంకా ఆయనకు ఉన్న ఫ్యాన్స్‌ సంఖ్య పెరిగింది.ఇక అన్ని వర్గాల వారు మెగాస్టార్‌ ను అభిమానిస్తూనే ఉంటారు. చిరంజీవి పుట్టిన రోజు నేడు.

ఈ సందర్బంగా ఆయనకు మా టీం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.చిరంజీవి మరిన్ని మంచి సినిమాలు చేయాలని మేము కోరుకుంటున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube