సౌత్ ఇండియన్ నెంబర్ వన్ గాయకుడు, దశాబ్దాలుగా తన గాన మాధుర్యంతో అందరి హృదయాలలో నిలిచిపోయిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాతో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
మరో వైపు అయన కోలుకొని తిరిగి రావాలని మరికొంత కాలం అతని గొంతుతో సినీ సంగీత ప్రేమికులని అలరించాలని కోరుకుంటున్నారు.ఇప్పటికే సెలబ్రిటీలు ఆయన ఆరోగ్యం బాగుండాలని కాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
దేవుడిని ప్రర్దిస్తున్నట్లు పేర్కొన్నారు.మరో వైపు ఎస్పీ బాలసుబ్రమణ్యంని అభిమానించే కోట్లాది ప్రజలు కూడా అయన తిరిగి కోలుకోవాలని కోరుకుంటున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రార్ధనలు చేస్తున్నారు.తాజాగా కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప ఆలయంలో సంగీత సమర్పణ చేశారు.
ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఆలాపించిన శంకరాభరణంలోని శంకరా నాద శరీరా పరా అనే పాటను దేవస్థాన వాయిద్యకారులు తమ ప్రదర్శనతో స్వామివారికి సమర్పించారు.దీనిపై అయ్యప్ప ఆలయ బోర్డు ట్రావెన్ కూర్ దేవస్వోం వర్గాలు స్పందించాయి.
ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ఆయన పేరుతో స్వామివారికి పూజలు నిర్వహించినట్టు వెల్లడించాయి.అప్పట్లో ఘనవిజయం సాధించిన శంకరాభరణం చిత్రంలో బాలు ఆలపించిన శంకరా నాద శరీరా పరా గీతం సాధారణ ప్రజల్లో ఎంతో ప్రజాదరణ పొందింది.
వాద్య నివేదనతో అయ్యప్ప స్వామిని ఎస్పీ బాలు ఆరోగ్యం కుదుటపడాలని చేసిన సంగీత సమర్పణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వుతుంది.మరో వైపు అన్ని దక్షిణాది రాష్ట్రాలలో చాలా మంది ఎస్పీ బాలు ఆరోగ్యం బాగుండాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.
ఒక గాన గాన్దర్వుడుకి ఇంతకంటే గొప్ప గౌరవం ఎక్కడ ఉండదు అనిపించే విధంగా ఆయన బయటకి రావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.