అజీర్తి.( Indigestion ) అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.
అయితే ఎప్పుడో ఒకసారి అజీర్తి ఇబ్బంది పెడితే పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.కానీ కొందరు తరచూ అజీర్తికి గురవుతుంటారు.
ఏం తిన్నా అరగదు.దాంతో ఏమన్నా తినాలంటే భయపడిపోతుంటారు.
నోరు కట్టుకొని ఇష్టమైన ఆహారానికి కూడా దూరంగా ఉంటారు.అజీర్తి సమస్యను వదిలించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ డ్రింక్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.ఈ డ్రింక్ తో సులభంగా అజీర్తి సమస్యకు స్వస్తి పలకవచ్చు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్( Water ) పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే ఎనిమిది నుంచి పది ఫ్రెష్ తులసి ఆకులు( Tulsi Leaves ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేసుకోవాలి.చివరిగా రెండు లవంగాలు మరియు రెండు దంచిన యాలకులు వేసి పది నుంచి పన్నెండు నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey ) కలిపితే మన డ్రింక్ సిద్ధమైనట్లే.ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ ను తీసుకుంటే జీలకర్ర, తులసి, లవంగాలు మరియు యాలకుల్లో ఉండే ప్రత్యేక సుగుణాలు జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.అజీర్తితో సహా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి.
కాబట్టి ఎవరైతే అజీర్తి సమస్యతో తరచూ బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ డ్రింక్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.అజీర్తికి స్వస్తి పలకండి.పైగా ఈ డ్రింక్ బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కూడా సహాయపడుతుంది.రెగ్యులర్ గా ఈ డ్రింక్ ను తీసుకుంటే బాన పొట్ట కొద్ది రోజుల్లోనే ఫ్లాట్ గా మారుతుంది.
మరియు తీవ్రమైన దగ్గును సైతం నివారిస్తుంది.