మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు అంటూ వెళ్లి ఏకంగా పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు.రాజకీయాలను పూర్తిగా వదిలేసి మళ్లీ సినిమాలే జీవితంగా భావిస్తాను అంటూ ఖైదీ నెం.150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా ప్రమోషన్ సమయంలోనే ఇకపై ఏడాదికి ఖచ్చితంగా రెండు సినిమాలు చేస్తానంటూ ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు.
ఏడాదికి రెండు సినిమాలు ఏమో కాని కనీసం రెండు ఏళ్లకు కనీసం ఒక్కటి కూడా రావడం లేదు.
సైరా సినిమా కోసం ఏకంగా రెండేళ్ల సమయంను కేటాయించాడు.
అదుగో ఇదుగో అంటూ గత ఏడాది చివర్లో సైరాను విడుదల చేశారు.సరే సైరా తర్వాత అయినా వరుసగా సినిమాలు వస్తాయేమో అని అంతా ఆశించారు.
కాని చిరంజీవి మళ్లీ నిరాశే పర్చుతున్నాడు.ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తున్న చిరంజీవి ఈ ఏడాది రాడని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
సరే ఈ ఏడాది కరోనా కారణంగా విడుదల చేయడం లేదనుకుంటే తదుపరి చిత్రం విషయంలోనూ మళ్లీ అదే తాత్కారంను ప్రదర్శిస్తున్నాడు.

కొరటాల శివ చిత్రం తర్వాత తాను చేయబోతున్న సినిమా అది ఇది అంటూ హడావుడి చేస్తున్నాడు తప్ప ఇంకా ఎవరికి ఓకే చెప్పలేదు.ఈ సమయంలో ఓకే చెప్పి ఉంటే ఆచార్య పూర్తి అయిన వెంటనే చిరు తదుపరి చిత్రం ప్రారంభం అయ్యేది కదా అంటూ కొందరు ప్రకటిస్తున్నారు.చిరంజీవి ఏడాదికి కనీసం ఒక్కటి అయినా సినిమాను విడుదల చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాని ఆయన మాత్రం హడావుడి ఎక్కువగా సినిమాలు తక్కువ అన్నట్లుగా ఉంది.