తెలుగుదేశం పార్టీలో చాలాకాలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ వినిపిస్తోంది .అనేక సందర్భాల్లో పార్టీ సీనియర్ నేతలు సైతం జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ టిడిపిలో యాక్టీవ్ చేయాలని, ఆయన తప్పు మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకు రావడం ఎవరివల్లా సాధ్యం కాదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, లోకేష్ పర్యటన లోనూ అనేక ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వినిపించింది.అయితే ఎక్కడా ఈ అంశాన్ని హైలెట్ కాకుండా చంద్రబాబు చూసుకున్నారు.
అసలు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ, దాటవేత ధోరణి అవలంబిస్తూ వ్యవహరించేవారు.జూనియర్ ఎన్టీఆర్ ను హైలెట్ చేయడం వల్ల లోకేష్ గ్రాఫ్ తగ్గించినట్లు అవుతుందని, పార్టీలో లోకేష్ ను ఎవరు పట్టించుకోరని, అనేక రకాలుగా రాజకీయ ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో చంద్రబాబు ఉంటూ వచ్చారు.
అయితే ప్రస్తుతం టిడిపి ఎదుర్కొంటున్న ఇబ్బందులు దృష్ట్యా చూస్తే, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కనుక ప్రతిపక్షంలో కి వెళ్లి పోతే, పార్టీ బలహీనం అవుతుందని, తాను కూడా రాజకీయాల్లో యాక్టీవ్ గా పాల్గొనే అవకాశం ఉండదని, అదే జరిగితే లోకేష్ తో పాటు టిడిపి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది అనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారు.అందుకే జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ టిడిపిలో యాక్టివ్ చేసి, పరిమితమైన ప్రాంతాల్లోనూ, వైసీపీకి గట్టి పట్టున్న చోట్ల ఎన్నికల ప్రచారానికి దించడం ద్వారా, 2024 ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయి అనే లెక్కల్లో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు సీనియర్ ఎన్టీఆర్ తో అనుబంధం ఉండి, జూనియర్ ఎన్టీఆర్ తోనూ అదే స్థాయిలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొంతమంది ప్రముఖులను జూనియర్ ఎన్టీఆర్ వద్దకు రాయబారం పంపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ వ్యవహారంలో లోకేష్ అభ్యంతరాలను సైతం పక్కనపెట్టి టీడీపీని గెలిపించడమే లక్ష్యం గా చంద్రబాబు ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట.