నేను పక్కాలోకల్ అంటున్నారు జనసేనా పవన్ కళ్యాణ్.అటూ సినిమాల్లో, ఇటూ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.తన కామెంట్లతో రాజకీయ వర్గాలో తన మార్క్‌ను చూపుతున్నారు.కానీ వైసీపీ నేతలు మాత్రం పవణ్ కళ్యాణ్‌పై మాటల దాడి చేస్తున్నారు.హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్న పవన్‌కు ఆంధ్ర ప్రదేశ్ సంబంధం లేదంటూ అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.పవన్ కేవలం ఏపీకి చుట్టపు చూపుగా వస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
జనసేన అధికానేత పవన్ ఇలా ఏపీకి వచ్చి మీటింగులు పెడితే పార్టీల జనాలలోకి ఎలా వెళ్తోందని చర్చించుకుంటున్నారు.ఈ విషయాన్ని గమనించిన పవర్ స్టార్ కీలక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జోరందుకుంది.
త్వరలోనే ఆయన పూర్తిగా విజయవాడ వేదికగా పార్టీని బలోపేతం చేస్తారని చర్చ జరుగుతోంది.ఏపీలో ఉంటూ తన రాజకీయాలు మొదలు పెడతారని తెలుస్తోంది.ఈ విషయంగా తెలియగానే జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.తమ నాయకుడు నిత్యం తమకు అందుబాటులో ఉంటే సమస్యను నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లవచ్చని బావిస్తున్నారు.
ఇలా పవన్ నిర్ణయం మంచి పరిణామం అని తెలుస్తోంది.

పవన్ విజయవాడకు మాకం మారిస్తే ఆయన షూటింగుల సంగతేంటి అన్న చర్చ జరుగుతోంది.వపన్ వరుగా సినిమాలు చేస్తున్నాడు.ఆయనతో సినిమాలు చేయాలని నిర్మాతలు క్యూడుతున్నారు.పవన్ ఏపికే పరిమితం అయితే సినిమాలు ఎలా పూర్తి చేస్తారని సందేహం నెలకొంది.అయితే ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది.పవన్ కొన్ని సినిమాలకు మాత్రమే ఒకే చెబుతున్నారు.
అదే జరిగితే మళ్లి పవన్ కళ్యాణ్ వెండి తెరకు విరామం ఇచ్చినట్టు అవుతుంది.ఇక రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.