జబర్దస్త్ షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుదో ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు.ఎంతోమంది కమెడియన్స్ ను పరిచయం చేసిన షో అది.
జబర్దస్త్ షో మీద స్కిట్స్ చేసి చాలా మంది నటులు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.అలా సినిమాల్లో నటిస్తునే తమకి స్టార్ డమ్ తెచ్చి పెట్టిన జబర్దస్త్ షో ను వదలకుండా ఇంకా స్కిట్స్ చేస్తూనే ఉన్నారు.
జబర్దస్త్ షో లో మనం చెప్పుకోదగ్గ కమెడియన్స్ లో చమ్మక్ చంద్ర కూడా ఒకరు.జబర్దస్త్ అతనికి ఎంత క్రెజ్ తెచ్చిందో మీ అందరికి తెలుసు.
కానీ అలంటి జబర్దస్త్ షో ను వదిలేసి జడ్జ్ అయిన నాగబాబుతో సహా జీ తెలుగు ఛానెల్ కి మారిపోయాడు.అయితే ఇన్నేళ్ల సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ చమ్మక్ చంద్ర తన సొంత గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బొమ్మ అదిరింది అంటూ వెళ్లిన జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర మళ్లీ ఏడాదిలోపే జబర్దస్త్ షో లోకి అడుగుపెట్టడం గమనార్హం.చమ్మక్ చంద్ర జబర్దస్త్ షో మానేసాడని తెలిసిన తర్వాత అతడి స్కిట్స్ అభిమానించే వాళ్లు కూడా షాక్ అయ్యారు.
ఇకపై చంద్ర ఆడవాళ్ళ మీద వేసే సెటైర్స్ లేవని, ఫ్యామిలీ స్కిట్స్ ఉండవని అందరు బాధ పడ్డారు.కొంతమంది నెటిజన్లు అయితే వెనక్కి వచ్చెయ్ చంద్ర అంటూ పిలిచారు కూడా.
కానీ జబర్దస్త్ వదిలేసి కొన్ని నెలల పాటు అక్కడే ఉన్నాడు చంద్ర.కానీ అయితే అదిరింది ప్రోగ్రామ్‌లో ఎన్ని మార్పులు, కూర్పులు చేసినాగాని ఫలితం లేదు.
ఆ షో జబర్దస్త్ దరిదాపులకు కూడా రేటింగ్ రావడం లేదు.

దాంతో ఇప్పుడు ఏకంగా బొమ్మ అదిరింది షో ఆపేసారని ప్రచారం జరుగుతుంది.దాంతో చమ్మక్ చంద్ర మళ్ళీ జబర్దస్త్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తుంది.అయితే ఏ వార్తల మీద ఇంకా క్లారిటీ లేదు.
జబర్దస్త్ లోకి ఎంతమంది వచ్చినా కూడా చంద్ర స్కిట్స్ లేని లోటు అలాగే ఉండిపోయింది.అయితే నాగబాబుని నమ్ముకుని వచ్చిన చంద్ర ఇలా అర్ధాంతరంగా నాగబాబుకు వెన్నుపోటు పొడిచాడేమో అని అంటున్నారు నెటిజన్లు.
ఏదేమైనా కూడా చమ్మక్ చంద్ర వస్తే మాత్రం జబర్దస్త్ అదిరిపోవడం ఖాయం.