గత కొద్ది నెలల నుండి విశాఖ స్టీల్ ప్లాంట్( Vizag Steel Plant) ప్రైవేటీకరణ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేయడం తెలిసిందే.వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అనేక వార్తలు హైలైట్ అవుతూ వచ్చాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ నీ దక్కించుకోవడానికి కార్పోరేట్ యాజమాన్యాలు కూడా రంగంలోకి దిగినట్లు కొన్ని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనలు తెలియజేశారు.
ఇదే సమయంలో ఏపీలో ప్రధాన పార్టీలు సైతం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటానికి తమ వంతు కృషి చేయడం జరిగింది.ఆ సమయంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని కొన్ని ప్రకటనలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే మరి కొద్ది నెలలలో ఎన్నికలు రాబోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం( Central Government ) కీలక ప్రకటన ప్రకటించింది.విషయంలోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విస్తృతస్థాయి సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్తామని కేంద్రం స్పష్టం చేయడం జరిగింది.
ప్లాంట్ లో పెట్టుబడులు ఉపసంహరణ ప్రక్రియకు, భూములు ఇతర ఆస్తుల విక్రయానికి భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపాకే ఆసక్తి వ్యక్తికరణాలను ఆహ్వానిస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు.కేంద్ర మంత్రి భగవత్ కారడ్ స్పష్టం చేయడం జరిగింది.2021 జనవరిలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్రయానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయా అంగీకారం ఇచ్చిందని గుర్తు చేశారు.ఇందులో 100% వాటా విక్రయానికి 2021లో క్యాబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు.