టాలీవుడ్ స్టార్ కమెడియన్లలో ఒకరైన బ్రహ్మానందం ఎన్నో సినిమాల సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.కొన్ని సినిమాలు ఆయన కామెడీ వల్లే హిట్టయ్యాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.
ఆయన కామెడీ లేకపోతే ఆ సినిమాల రిజల్ట్ మరోలా ఉండేదేమో చాలామంది ఫ్యాన్స్ భావిస్తారు.కొన్ని పాత్రలకు బ్రహ్మానందం తప్ప ఎవరూ న్యాయం చెయ్యలేరు.
శ్రీనువైట్ల సినిమాలలో మెజారిటీ సినిమాల సక్సెస్ బ్రహ్మానందం కారణమని చెప్పవచ్చు.
యావరేజ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు మళ్లీమళ్లీ చూడటానికి బ్రహ్మానందం ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమయ్యారు.
శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఢీ, రెడీ, కింగ్ సినిమాల సక్సెస్ లో బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.బాద్ షా, నమో వెంకటేశ సినిమాల సక్సెస్ కు కూడా బ్రహ్మానందం కారణమని కామెంట్లు వినిపిస్తాయి.
వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన కృష్ణ, అదుర్స్, అల్లుడు శ్రీను సినిమాలలో బ్రహ్మానందం కామెడీ పంచ్ లు ఏ రేంజ్ లో పేలాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన రేసుగుర్రం సినిమా సక్సెస్ లో కూడా బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు.దూకుడు సినిమాలో బ్రహ్మానందం కామెడీని తీసేసి చూడలేం.ఆ సినిమా సక్సెస్ కు బ్రహ్మానందం కారణం కాగా ఆ మూవీలో ఎమ్మెస్ నారాయణ కామెడీ టైమింగ్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమాకు కూడా శ్రీనువైట్ల డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.
కిక్, వెంకీ, దుబాయ్ శ్రీను, విక్రమార్కుడు, జాతిరత్నాలు సినిమాలలో కూడా బ్రహ్మానందం కామెడీ హైలెట్ గా నిలిచింది.జులాయి, అత్తారింటికి దారేది సినిమాలలోని బ్రహ్మానందం రోల్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.మన్మథుడు, జల్సా సినిమాలలో కూడా బహ్మానందం కామెడీ ఆకట్టుకుంది.
కొన్ని ఫ్లాప్ సినిమాలలో కూడా బ్రహ్మానందం కామెడీ బాగుంటుంది.బ్రహ్మానందంకు సంబంధించిన ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి.