తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు హీరోగా, విలన్ గా, దర్శకుడిగా,నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా విద్యా రంగంలో కూడా విద్యావేత్తగా ఎంతోమంది విద్యార్థులను మోహన్ బాబు తన విద్యాసంస్థల ద్వారా ఉన్నత స్థానంలో నిలబెట్టారు.
ఇలా సినిమా, విద్యా రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మోహన్ బాబు నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే పెద్దఎత్తున ఈయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఈ పుట్టినరోజు మోహన్ బాబుకు ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి.నేటితో మోహన్ బాబు 70 వసంతంలోకి అడుగు పెట్టారు.
ఈ క్రమంలోనే చిత్రపరిశ్రమకు వరాల జల్లు కురిపించారు.చిత్రపరిశ్రమలోనే 24 క్రాఫ్ట్ కి సంబంధించిన ఏ ఆర్టిస్ట్ పిల్లలైనా ఉన్నత విద్య చదువుకోవాలంటే తన మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా ఫీజులో వారికి కన్సేషన్ ఇస్తానని వెల్లడించారు.
దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఇక మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో బర్త్ డే సీడీపీని విడుదల చేశారు మోహన్‌బాబు టీమ్.

మోహన్ బాబు నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలోని లుక్ ప్రధానంగా తీసుకొని మోహన్ బాబు బర్త్ డే సీడీపీని డిజైన్ చేశారు.ఇక ఈ సీడీపీలో మోహన్ బాబు సినీ కెరియర్ లో అందుకున్న అద్భుతమైన సినిమా పేర్లను, ఆ సినిమాలో మోహన్ బాబు లుక్స్ ను పంచుకున్నారు.తాజాగా ఈ బర్త్ డే సీడీపీ వైరల్ అవుతుంది.నటుడిగా మోహన్‌బాబు 500లకుపైగా చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.సన్ ఆఫ్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇక పాన్ ఇండియా స్థాయిలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం సినిమాలో కీలక పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు.