సాధారణంగా జంతువులు తమ యజమానులు ఏది చేస్తే అది చేయడానికి ప్రయత్నిస్తాయి.కుక్కలు తమ యజమానిని ఇమిటేట్ చేయడంలో చాలా దిట్ట.
ఇదే విషయాన్ని నిరూపిస్తుందో వీడియో.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కుక్క పియానో వాయిస్తూ పాట పాడుతూ కనిపించింది.
ఈ వీడియోని డాగ్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ అనే ఒక పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 57 వేలకు పైగా లైకులు, మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక బుల్‌డాగ్ ఒక రూమ్ లో ఉన్న పియానో పై ముందు కాళ్ళు ఉంచడం చూడొచ్చు.అంతే కాదు అది పియానో వాయిస్తూ అరుస్తూ ఉంది.
ఒక ప్రొఫెషనల్ సింగర్ రాగాలు తీసినట్లుగా, ఈ శునకం పియానో వాయిస్ తో రాగాలు తీయడం మీరు చూడొచ్చు.ఈ కుక్కకి పియానో ప్లే చేస్తూ పాటలు పాడటమంటే చాలా ఇష్టమట.
అందుకే ఇది రోజులో ఒక్కసారైనా పియానో ముందుకొచ్చి తనలోని గాయకుడిని బయట పెడుతూ ఉంటుందట.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఒకవేళ ఈ కుక్క మ్యూజికల్ కన్సర్ట్ లేదా సంగీత కచేరి పెడితే, మేం తప్పకుండా టికెట్లు కొనుగోలు చేస్తామని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.ఇకపోతే పాటలు పాడటం మాత్రమే కాదు చాలా ఆటలు ఆడగల తెలివి కూడా కుక్కలకు ఉంటుంది.
ఇప్పటికే అవి చాలా స్పోర్ట్స్ లో పాల్గొని తమ సత్తా చాటాయి.అలాగే పోలీసు, ఆర్మీ రంగాల్లో ఇవి ఎలాంటి కీలక పాత్రలను పోషిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఈ అద్భుతమైన వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.