NRO (నాన్ రెసిడెంట్ ఆర్డినరీ) ఎన్నారైల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ఖాతాను కొన్ని బ్యాంకులు అందిస్తాయి.ఈ ఖాతాలో ఎన్నారైలు డబ్బులు నిల్వ చేసుకోవచ్చు అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు.
అలాగే భారత్ లో ఉండే ఎన్నారైల భందువులతో జాయింట్ ఖాతాద్వారా వీటిని నడుపుకోవచ్చు.ఈ ఖాతాలలో డబ్బు దాచుకునే వారికీ నిభందనలకు లోబడి ఆదాయపు పన్ను నుంచీ మినహాయింపు కూడా ఉంటుంది.
ఎంతో మంది భారత ఎన్నారైలు ఈ ఖాతాల్లో డబ్బు దాచుకుంటారు కూడా.అయితే ఇలాంటి ఖాతా దారులు అందరికి బ్యాంక్ లు గుడ్ న్యూస్ తెలిపాయి.
NRO ఖాతాల్లో దాచుకునే డిపాజిట్ల కు వడ్డీ రెట్లు పెంచుతూ కొన్ని బ్యాంక్ లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి.సహజంగా వారికి ఇస్తున్న వడ్డీ ఎక్కువే అయితే ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ కంటే కూడా అత్యధిక వడ్డీలను ఆఫర్ చేస్తున్నాయి కొన్ని బ్యాంక్ లు.ఎన్నారైలకు భారత్ లో వారి ప్రాంతాలలో ఉండే ఆస్తుల తాలూకు డబ్బు చెల్లింపులు , వారి జీతాలు, స్టాక్ మార్కెట్ డివిడెండ్లు, ఇలాంటివి వారి ఎకౌంటు లలో డిపాజిట్ చేసుకోవచ్చు.వీరు విదేశీ డబ్బును ఈ ఎకౌంటు లలో జమ చేసుకుని వాటిని ఇక్కడి రూపాయల్లో పొందవచ్చు.
బ్యాంక్ లు ఇక్కడి ఖాతాదారులకు సహజంగా ఇచ్చే వడ్డీ కంటే కూడా NRO ఎకౌంటు ల ద్వారా NRI లకు ఇచ్చే వడ్డీ అధికంగా ఉంటుంది.అయితే

ప్రస్తుతం NRO ఎకౌంటు లను కలిగి ఉన్న బ్యాంక్ లు డిపాజిట్ల పై వడ్డీ రేట్లను అమాంతం పెంచేశాయి.ఏ బ్యాంక్ ఎంతెంత వడ్డీ రేట్లు ఇస్తోందంటే.
– ఉజ్జీవన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండేళ్ళ నుంచీ మూడు ఏళ్ళ కాలపరిమితితో సుమారు 6.90 వడ్డీ అందిస్తోంది.
– ఆర్బి ఎల్, ఈక్విటాస్ , ఇండస్ ఇండ్ బ్యాంక్ లు రెండేళ్ళ నుంచీ మూడేళ్ళ కాలపరిమితితో 6.5 వడ్డీని అందిస్తున్నాయి.
– అన్నిటికంటే అత్యధికంగా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండేళ్ళ నుంచీ మూడేళ్ళ కాలపరిమితితో 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.