భారతీయుల మనసులను దోచే కార్లు ఇవే!

భారతీయ మార్కెట్లో SUVల డిమాండ్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు.ఈమధ్యకాలంలో వీటి అమ్మకాలు బాగా జోరందుకున్నాయి.

 Best Selling Hatchback Cars In India Baleno Wagonr Details, Indian Favourite Car-TeluguStop.com

కొత్త మోడల్స్ వస్తున్నప్పటికీ కొన్ని హ్యాచ్‌బ్యాక్ కార్లు( Hatchback Cars ) తమ సత్తా చాటుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.కొన్ని హ్యాచ్‌బ్యాక్ కార్లు బాగా అమ్ముడవుతున్నాయి.

అది మాత్రమే కాకుండా ఈ కార్లు అమ్మకాల చార్టులలో అగ్రస్థానంలో ఉన్నాయి మరి.అవును, మీరు విన్నది నిజమే.ఈ కార్లు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇవి ముందంజలో ఉంటాయి.

ఇక సెప్టెంబర్ 2023 గురించి చెప్పాలంటే, మారుతి బాలెనో,( Maruti Suzuki Baleno ) వ్యాగన్ఆర్( WagonR ) అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల లిస్టులో వున్నాయి.గత నెలలో, బాలెనో 18,417 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలవగా, వ్యాగన్ఆర్ 16,250 యూనిట్ల విక్రయాలతో నంబర్-2 స్థానంలో తన హవా కొనసాగుతోంది.మారుతి సుజుకి బాలెనో ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, దీని ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీలో) రూ.6.61 లక్షల నుంచి రూ.9.88 లక్షల మధ్య ఉంటుంది.బాలెనో మార్కెట్లో హ్యుందాయ్ ఐ20,( Hyundai I20 ) టాటా ఆల్ట్రోజ్, ( Altroz ) టయోటా గ్లాంజాతో( Toyota Glanza ) పోటీపడుతోంది.ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది.ఇది 90 bhp, 113 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఇకపోతే కంపెనీ బాలెనోను CNG వెర్షన్‌లో కూడా విక్రయిస్తోంది.ఇది హెడ్‌అప్ డిస్‌ప్లే, వెనుక AC వెంట్‌లు, 360 డిగ్రీ కెమెరా, వెనుక ఫాస్ట్ ఛార్జింగ్ USB పోర్ట్, LED ఫాగ్ ల్యాంప్స్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.Wagon R దాని క్యాబిన్ స్పేస్, సౌకర్యాలతో ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

ఇంకా దీని పొడవాటి డిజైన్ దాని విక్రయాలలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇది మంచి హెడ్‌రూమ్, లెగ్‌రూమ్‌ను అందిస్తుంది.వ్యాగన్ఆర్‌లో 1.0 లీటర్ కె-సిరీస్ ఇంజన్, 1.2-లీటర్ ఇంజన్ ఎంపిక ఉంది.1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 88.5 బిహెచ్‌పి, 113 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.దీని ఎక్స్-షోరూమ్ ధర (ఢిల్లీలో) రూ.6.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Best Selling Hatchback Cars in India

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube