టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న అల్లర్ల కేసులో చంద్రబాబుకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
ఈ మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ ను మంజూరు చేసింది.కాగా అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







