దిగ్గజ ఇన్స్టంట్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్( WhatsApp ) ఎప్పటికప్పుడు తన వినియోగదారులకు మంచి మంచి అప్డేట్లు ఇస్తూ వారి భద్రతకు భరోసా ఇస్తుంది.ఈ క్రమంలోనే ఇటీవల, వాట్సాప్ షెడ్యూల్డ్ కాల్స్ అనే కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో( WABetaInfo ) అధికారికంగా వెల్లడించింది.
ఈ స్పెసిఫికేషన్‌తో గ్రూప్ చాట్స్‌లో కాల్స్ ను తేలికగా ప్లాన్ చేసుకోవచ్చు.దీంతో పాటు ఇప్పుడు వాట్సాప్ డెవలపర్లు మరో కొత్త గ్రూప్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు సమాచారం.
అవును, గ్రూప్ చాట్ ఈవెంట్స్ అని పిలిచే ఈ ఫీచర్‌తో ఈవెంట్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా వాటిని మేనేజ్ చేసుకోవచ్చు.

దీనివలన ఏదైనా ఒక గ్రూపులోకి వెళ్లి చాట్ షేర్ మెనూ లేదా అటాచ్మెంట్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఈ ఫీచర్‌ను తేలికగా యాక్సెస్ చేయవచ్చు.ప్రస్తుతం ఒక గ్రూపులోకి వెళ్లి అటాచ్మెంట్ ఐకాన్‌పై క్లిక్ చేసినప్పుడు చివరి ఆప్షన్‌గా పోల్ కనిపిస్తుంది.ఇక త్వరలో దాని పక్కనే ఈవెంట్ అనే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
అదొచ్చాక ఈవెంట్‌పై నొక్కి ఏదైనా ఈవెంట్ క్రియేట్ చేసుకోవచ్చు.ఈవెంట్‌కు పేరు పెట్టవచ్చు, చాట్‌లో దాని గురించి ఎప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు కూడా.
ఈవెంట్ ఏదైనా బర్త్ డే పార్టీ, మీటింగ్, సినిమా నైట్ లేదా కాంటాక్ట్స్ తో షేర్ చేయాలనుకుంటున్న ఏదైనా ఇతర సందర్భం కోసం ఈవెంట్‌ను క్రియేట్ చేసుకోవచ్చు.

కాగా ఈ నేపధ్యంలో వాట్సాప్ బీటా ఇన్ఫో ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో స్క్రీన్‌షాట్‌తో సహా వివరాలను వెల్లడించింది.ఈ చాట్ ఈవెంట్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయని, అంటే చాట్‌లో పాల్గొనేవారు మాత్రమే వాటిని చూడగలరని, చేరగలరని కూడా పేర్కొంది.కాగా ఈ ఈవెంట్స్ ను ఎవరూ యాక్సెస్ చేయలేరని, వాట్సాప్ కూడా చూడలేదని స్పష్టం చేసింది కూడా.
అయితే, ఈ ఫీచర్ 256 కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న కమ్యూనిటీ గ్రూప్ చాట్( Community group chat )లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.ఆ గ్రూపులో మెంబర్‌గా ఉన్నవారు చాట్‌లో ఈవెంట్‌ను క్రియేట్ చేయవచ్చు.