ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అందుకున్నాయి.తక్కువ బడ్జెట్ తో కంటెంట్ బేస్ కథలతో తెరకెక్కుతున్న సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.
ఎలాంటి అంచానాలు లేకుండా సినిమాలకి వెళ్ళడంతో మినిమం బాగుందంటే టాక్ వచ్చిన వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.కొత్తదనం ఉంది అనే అభిప్రాయం జనాల్లోకి వెళ్తే చాలు ఆటోమేంటిక్ గా హిట్ అవుతుంది.
అలాగే పెళ్లి చూపులు సినిమా నుంచి తాజాగా వచ్చిన జాతిరత్నాలు మూవీ వరకు అన్ని కూడా నేచురాలిటీకి దగ్గరగా ఉంటూ వినోదాన్ని పండించి డిఫరెంట్ కథాంశంతో ఆకట్టుకున్నవే.ఇదే కోవలో బట్టలరామస్వామి బయోపిక్ అనే సినిమా కూడా ఈ మధ్య కాస్తా బజ్ క్రియేట్ చేసుకుంది.
అల్తాఫ్ హసన్, శాంతి రావ్, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ మధ్యకాలంలో బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న నేపధ్యంలో ఓ సామాన్యుడి బయోపిక్ గా ఈ సినిమాని ఆవిష్కరించారు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో భార్య ఉండగా మరో అమ్మాయిని ఇష్టపడే బట్టల రామస్వామి పాత్రలో అల్తాఫ్ హాసన్ నటించాడు.ఇదిలా ఉంటే రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.జీ5 ఒటీటీ చానల్ ద్వారా ఈ సినిమాని మే 14న రిలీజ్ చేయబోతున్నట్లు చానల్ యాజమాన్యం ప్రకటించింది.డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని వారు చెప్పుకొచ్చారు.
చిన్న సినిమాలు అన్ని కూడా ఈ మధ్యకాలంలో ఒటీటీ బాట పడుతున్నాయి.అక్కడ డిజిటల్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి.ఈ నేపధ్యంలో బట్టల రామస్వామి ఎంత వరకు ఆకట్టుకుంటుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి.