బేబీ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వారిలో విరాజ్ అశ్విన్ ఒకరనే సంగతి తెలిసిందే.విరాజ్ అశ్విన్ నటన బేబీ సినిమాకు హైలెట్ గా నిలిచింది.
అయితే విరాజ్ అశ్విన్( Viraj ashwin ) అంతకు ముందే పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలతో రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది.విరాజ్ అశ్విన్ ఫాదర్ ఇస్రో సంస్థలో పని చేస్తారట.
విరాజ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు.
విరాజ్ అశ్విన్ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం గమనార్హం.
అనగనగా ఓ ప్రేమకథ, థాంక్యూ బ్రదర్ సినిమాలు విరాజ్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ ను పెంచాయి.మనసా నమః అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా విరాజ్ పాపులారిటీని పెంచుకున్నారు.
బేబీ( Baby movie) సక్సెస్ తో విరాజ్ అశ్విన్ కు సినిమా ఆఫర్లు అంతకంతకూ పెరుగుతున్నాయి.మాది అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కామెంట్లు చేశారు.
నాన్న బాగా చదువుకోవాలని సూచించారని తనలా గొప్ప సైంటిస్ట్ కావాలని కోరారని విరాజ్ అశ్విన్ పేర్కొన్నారు.నా బాల్యమంతా ఒక టౌన్ షిప్ లో గడిచిందని టౌన్ షిప్ అంటే ఇస్రో ఫ్యామిలీస్ అంతా అక్కడ ఉంటాయని అన్నారు.గీతం యూనివర్సిటీలో నేను బీటెక్ పూర్తి చేశానని విరాజ్ అశ్విన్ వెల్లడించారు.నేను రిచ్ లైఫ్ ఎప్పుడూ చూడలేదని ఆయన కామెంట్లు చేశారు.
నా లుక్స్ వల్ల నేను చాలా రిచ్ అని అనుకుంటారని విరాజ్ అశ్విన్ పేర్కొన్నారు.రాకెట్ లాంఛింగ్( Rocket lanching ) మాత్రం చాలాసార్లు చూశానని ఆయన వెల్లడించారు.విరాజ్ అశ్విన్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విరాజ్ అశ్విన్ కు మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు భావిస్తున్నారు.బేబీ సక్సెస్ తో విరాజ్ పారితోషికం పెరిగిందని తెలుస్తోంది.