అది ఊహకు కూడా అందని దారుణం.ఎందుకంటే కాపాడాల్సిన పోలీసుల మీదే జరిగిన దాష్టీకం అది.
రోడ్లను ఆక్రమించుకొని కొందరు కావాలని అక్రమంగా నిరమ్ఇంచిన షాపుల్ని ఖాళీ చేస్తుండగా మహిళా పోలీసు అని కూడా చూడంకుడా ఊహించనిరీతిలో దాడికి పాల్పడ్డారు.ఈ ఉదంతం ఇప్పుడు మహారాష్ట్రలోని ఠాణె ప్రాంతంలో పెను సంచలనం రేపుతోంది.
ఈ ఏరియాలో రోడ్లు అలాగే ఫుట్ పాత్ లపై కొందరు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవడంతో వీటిపై ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ కొరడా విధించింది.
ఇందులో భాగంగా ఇక్కడి మున్సిపల్ కమిషనర్ అయిన విపిన్ శర్మ ఎట్టి పరిస్థితుల్లో ఫుట్‌పాత్‌పై దుకాణాలు నడుపుతున్న తోపుడు బండ్లను ఖాళీ చేయిచంఏందుకు ప్రయత్నించారు.
కాగా ఈ క్రమంలోనే వారికి అలాగే దుకాణాదారులకు ఘర్షణ ఏర్పడగా వెంటనే మహిళా ఏసీపీ అయిన కల్పితా పింపుల్ అక్కడకు వచ్చారు.ఇక ఆమె ఆధ్వర్యంలో తొలగింపులు జరుగుతుండగా ఉన్నపళంగా ఖాళీ చేయిస్తే మా పరిస్థితి ఏంటి అంటూ దుకాణాదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఈ సందర్భంలోనే అమర్జీత్ యాదవ్ ఓ వ్యాపారి ఆవేశంతో కత్తి తీసుకువచ్చి కల్పితా పింపుల్ మద దారుణంగా దాడి చేశారు.
ఇక ఈ దాడిలో ఆమెతో పాటు ఆమె సెక్యూరిటీ గార్డు అయిన వ్యక్తికి కూడా బాగానే గాయపడ్డాడు.కాగా ఆమె మీద జరిగిన దాడిలో ఆమె చేతివేళ్లు కట్ అయ్యయి.ఇక ఈ దారుణానికి పాల్పడిన కూరగాయల వ్యాపారి మీద పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు.
కాగా ఒక మహిళా ఏసీపీ మీద ఇలాంటి దారుణాలు జరగడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.ఇప్పుడు ఈ ఉదంతం పూణెలో తీవ్ర సంచలనంగా మారిందనే చెప్పాలి.పోలీసులకే రక్షణ లేకపోతే ఎలా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ మ్యాటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.