Sivannarayana : అప్పాజీ ఆ మజాకా ….అదరగొట్టేశాడుగా….!!

1990 లలో పుట్టి, కేబుల్ టీవీ సౌకర్యం ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఒకటుంది.అదే అమృతం( Amrutham )హాలీవుడ్ లో బాగా వర్క్ అవుట్ అయిన ఫ్రెండ్స్, టు అండ్ ఆ హాఫ్ మెన్ వంటి సిట్ కామ్ ల నుంచి ఇన్స్పైర్ అయ్యి జీ టీవీ వాళ్ళు నిర్మించిన సీరియల్ ఇది.గుణ్ణం గంగరాజు అనే వ్యక్తి దీనిని తెరకెక్కించారు.2001 ప్రారంభమైన ఈ సీరియల్ 6 సీజన్లతో నాలుగేళ్లపాటు విజయవంతంగా నడిచింది.ప్రేక్షకుల జీవితాలను నవ్వులతో నింపేసింది.ఆంజనేయులు గా గుండు హనుమంతు రావు గారు, అమృత రావు గా శివాజీ రాజా గారు, సంజీవిని గా ఝాన్సీ గారు, ఇంటూరి వాసు, హర్షవర్ధన్, ఎస్ ఎస్ కాంచి……ఇలా ఎందరో నటులు, తమ సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టింది ఈ సీరియల్ నుంచే.

 Appaji Performance In Sound Party Tollywood-TeluguStop.com

ఐతే ఇప్పుడు మన మాట్లాడుకోవాల్సింది ఈ సీరియల్ లో అప్పాజీ గా నటించిన శివన్నారాయణ గారి గురించి.

Telugu Amrutham, Andhra Pradesh, Appaji, Hrithika, Sivannarayana, Sound, Tollywo

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా, శివరామపురంలో 1965 లో జన్మించారు శివన్నారాయణ( Sivannarayana ) ఆయన హైదరాబాద్ లో చదువు పూర్తిచేసుకొని, బి ఎస్ యెన్ ఎల్ లో పని చేస్తూ నాటకాలు వేసేవారు.ఆయన హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి థియేటర్ ఆర్ట్స్ లో మాస్టర్స్ చదువుకున్నారు.అప్పుడే అతనికి అమృతం సీరియల్ లో అవకాశం వచ్చింది.

ఆ తరువాత ఎన్నో చిత్రాలలో కూడా నటించారు.కానీ ఆయనకు అమృతం సీరియల్ తెచ్చినంత పేరు, గుర్తింపు ఏ సినిమా తీసుకురాలిపోయింది.

ఎందుకంటే ఆయన సినిమాలలో చేసిన పాత్రలన్నీ చిన్న చిన్న పాత్రలే.ఇన్నేళ్ల సినిమా కెరీర్ లో ఆయనకు ఒక్క ఫుల్ లెన్త్ క్యారెక్టర్ కూడా దొరకలేదు.

ఇన్నాళ్ళకి ఆ అవకాశం “సౌండ్ పార్టీ( sound party ) చిత్రంలో దొరికింది.ఎన్నో ఏళ్ళనుంచి ఎదురు చూస్తున్న అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? శివన్నారాయణ కూడా ఏమాత్రం తగ్గలేదు.సౌండ్ పార్టీ చిత్రాన్ని తన భుజాల పై మోశాడు.ఈ చిత్రంలో అతని యాక్టింగ్, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉన్నాయ్.ఈ పాత్ర తాను తప్ప మరెవ్వరు చెయ్యలేరు అన్నట్టు పాత్రలో జీవించేసారు.

Telugu Amrutham, Andhra Pradesh, Appaji, Hrithika, Sivannarayana, Sound, Tollywo

బిగ్ బాస్ ఫేమ్ వీ జే సన్నీ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో తండ్రిగా నటించారు శివన్నారాయణ.ఈ చిత్రంలో ఆయన పాత్ర తప్ప చెప్పుకోదగ్గ విషయాలు ఇంకేమి లేవు.ఒక చిన్న జబర్దస్త్ స్కిట్ ని లాగి( VJ Sunny ), పీకి తీసినట్టు ఉంది చిత్రం.

ఇంకా మాట్లాడుకోవాలంటే హీరోయిన్ హ్రితిక పర్వాలేదనిపించింది.ఈమె ప్రముఖ హీరోయిన్ ఆమని మేనకోడలు.

కాస్త ఎంకరేజ్ చేస్తే మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube